హీరో విజయ్ సినిమా కోసం క్యూలో ముగ్గురు స్టార్ హీరోయిన్స్.. కన్ఫార్మ్ చేయనున్న డైరెక్టర్..

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'మాస్టార్' మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అటు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో

హీరో విజయ్ సినిమా కోసం క్యూలో ముగ్గురు స్టార్ హీరోయిన్స్.. కన్ఫార్మ్ చేయనున్న డైరెక్టర్..
Follow us

|

Updated on: Feb 06, 2021 | 3:31 PM

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్టార్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అటు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో మరో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. మలవికా మోహన్ హీరోయిన్‏గా నటించింది. ఇక విజయ్ ఈ మూవీ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ తమిళ్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా విజయ్ కెరీర్‏లో 65వ చిత్రం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు అనుకుంటున్నారట. అది కూడా పాన్ ఇండియా లెవెల్ క్రేజీ ఉన్నవారే అని టాక్. అందులో కియారా అద్వానీ, రష్మిక మందన్నా, పూజా హెగ్డే పేర్లను పరిశీలిస్తున్నారట డైరెక్టర్. వీరిలో ఒకరిని కన్ఫార్మ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బు, ఆరివులు యాక్షన్ పార్ట్‏ను కొరియోగ్రాఫ్ చేయనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

Also Read:

Actor Ram Pothineni: సినిమాలకు బ్రేక్ ఇచ్చానంటున్న రామ్.. సరికొత్త గెటప్‏లో షాక్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్..