
ఇప్పుడు సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో స్టార్ నటీనటుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రిజల్ట్ అందుకుంటున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలు సైతం సక్సెస్ అవుతున్నాయి. ఇక స్టార్ హీరోస్, బడ్జెట్ ఎక్కువగా ఉన్న పలు చిత్రాలు విఫలమవుతున్నాయి. ఎంతో మంది ప్రఖ్యాత దర్శకుల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. కానీ మీకు ఒక సినిమా విషయం గురించి తెలుసా.. ? భారీ అంచనాల మధ్య విడుదలై ఘోరంగా డిజాస్టర్ అయిన సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా మొత్తం మీద కేవలం రూ.60 వేలు మాత్రమే వసూలు చేసింది. అంటే.. బడ్జెట్‌పై ఇది 0.0001% లాభాన్ని కూడా చూడలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ.. ‘ది లేడీ కిల్లర్’, ఇది గత సంవత్సరం హిందీలో విడుదలైంది.
ఎక్కువ మంది చదివినవి : Krishna : తొలి సినిమాకే రికార్డు.. 1965లో సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..
అజయ్ భాహి దర్శకత్వంలో, అర్జున్ కపూర్ , భూమి పట్నాయక్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం గత సంవత్సరం నవంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. అయితే, విడుదలైన మొదటి సన్నివేశం నుంచే ఈ చిత్రానికి ప్రతికూల సమీక్షలు వచ్చాయి. ఈ చిత్రం మొదటి రోజు భారతదేశం అంతటా కేవలం 293 టిక్కెట్లను మాత్రమే అమ్ముకుంది. రూ. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని విస్తృతమైన ప్రచారం లేకపోవడం వల్ల మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం 12 స్క్రీనింగ్‌లలో మాత్రమే ప్రదర్శించారు. అయితే, ఆ స్క్రీనింగ్‌లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు.. కారణం చెప్పిన జగపతి బాబు..
సినిమా వైఫల్యానికి మరో కారణం దాని అసంపూర్ణమైన క్లైమాక్స్. సినిమానే అసంపూర్ణంగా ఉండి, కొన్నిచోట్ల మధ్యలో ఆగిపోయింది, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు సంతృప్తినివ్వలేదు. సగం స్క్రిప్ట్‌తో హడావిడిగా సినిమా తీశామని దర్శకుడు కూడా చెప్పారు. ప్రారంభంలో, నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. కానీ సినిమా చూసిన తర్వాత, ఓటీటీ విడుదలను విరమించుకుంది. ఏ ఓటీటీ కంపెనీ కూడా ఈ సినిమాను కొనడానికి ముందుకు రాకపోవడంతో, చిత్ర బృందం ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..