ఆఫర్ ఇస్తామని చెప్పిన డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ గా వాడుకున్నారు.. నాని సంచలన కామెంట్స్

|

Mar 26, 2023 | 7:06 AM

ప్రస్తుతం టాలీవడ్ భారీ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ, నాని చిత్రాలను చూసేందుకు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. నాని హీరోగా ‘దసరా’ ఈ నెల 30న విడుదలవుతుండగా, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది.

ఆఫర్ ఇస్తామని చెప్పిన డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ గా వాడుకున్నారు.. నాని సంచలన కామెంట్స్
Nani
Follow us on

ప్రస్తుతం టాలీవడ్ భారీ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ, నాని చిత్రాలను చూసేందుకు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. నాని హీరోగా ‘దసరా’ ఈ నెల 30న విడుదలవుతుండగా, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. తాజాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారి కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

అవకాశాల గురించి మొదట నాని మాట్లాడుతూ ‘నా ఫోటో ఆల్బమ్ పట్టుకుని చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాడినని చెప్పాడు. ఎక్కడ కనీసం నన్ను లోపలికి కూడా రానివ్వలేదని తెలిపాడు. ఒక ఫోన్ కూడా రావట్లేదు, కనీసం చిన్న పాత్ర కూడా ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదని తెలిపాడు. ఈ ప్రయత్నంలోనే ఒకరిద్దరు డైరెక్టర్స్ చివరికి నన్ను డ్రైవర్ లాగా వాడుకున్నారన్నాడు. అంతేకాకుండా రకరకాల పనులు చేయించుకునేవారని తెలిపాడు. చివరకు తన ATMలో పండుగ బట్టల కోసం దాచుకున్న డబ్బు కూడా వారికి వాడాల్సి వచ్చిందన్నాడు. ఇదంతా చూసి చిరాకేసి ఇక ఈ యాక్టింగ్ మన వల్ల కాదని నిర్ణయించుకున్నాని చెప్పుకొచ్చాడు. మరోవైపు నాని కథను విన్న అభిమానులు …..అప్పట్లో అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న నాని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..