
Thaman Counter Rumours: కాపీ క్యాట్ ముద్రపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఘాటుగా స్పందించాడు. ఆయనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. గతేడాది పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన తమన్ ఎందరో అభిమానల ప్రేమను చూరగొన్నాడు. ముఖ్యంగా గతేడాది అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలోని పాటలు యూట్యూబ్‌లో చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే తమన్ కాపీ క్యాట్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై తమన్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడు. తాను కాపీ కొడుతున్నానని తెలిస్తే.. కాపీ ట్యూన్స్ ప్లే చేస్తే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా అంటూ తమన్ అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి కాపీ క్యాట్ అనే ముద్రపై స్పందించాడు ఈయన. ‘వాళ్లకి అంత దమ్ముంటే. వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్ చేసి చూపించమనండి’ అంటూ మండిపడ్డాడు తమన్. ఎవడు పడితే వాడు వచ్చి కాపీ కొట్టాడంటే ఇక్కడ ఎవడూ వినేవాడు లేడు అంటూ ఫైర్ అయ్యాడు. ఓ పాట విడుదల చేసేముందు అందరూ వింటారు.. ఆడియో కంపెనీలు, లిరిక్ రైటర్లు, తనతో పనిచేసే వాళ్లు అంతా వింటారు.. మరి వాళ్లందరికీ నచ్చే పాట కాపీ అయితే వాళ్లకు తెలివి లేదంటారా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ నిజంగా కాపీ కొడితే దర్శక నిర్మాతలకి తన ముఖం ఎలా చూపిస్తా అంటూ ఫైర్ అవుతున్నాడు. అయినా కూడా పనిలేని కొందరు చేసే కామెంట్స్ పట్టించుకుంటూ కూర్చుంటే తన పని ఆగిపోతుందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని చదవండి: