
వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగమ్మాయి కృష్ణ మంజూషను ఎంపిక చేశారని సమాచారం. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కీలక పాత్ర పోషిస్తోంది. 14రీల్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.