తమిళ బిగ్‌బాస్ ఫేం, నటి యాషిక ఆనంద్ గత నెల నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణ స్నేహితురాలు పావని అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో యాషిక ఆసుపత్రిలో చేరింది. కొద్ది రోజులు విషమ పరిస్థితులలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న యాషిక.. ఇటివలే కోలుకున్నారు. అయితే తాజాగా యాషిక తన స్నేహితురాలిని గుర్తుచేసుకుంటూ తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. బ్రతికి ఉన్నంత కాలం నేను దోషిగానే బాదపడతాను అంటూ స్నేహితురాలిపై సుదీర్ఘ పోస్ట్ చేశారు. ప్రస్తుతం యాషిక పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాషిక తన ఇన్‌స్టాలో.. ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో కూడా చెప్పలేకపోతున్నాను. నేను జీవించి ఉన్న కాలం ఈ ప్రమాదానికి గిల్టీగా ఫీలవుతాను. ఆ విషాద ప్రమాదం నుంచి నన్ను కాపాడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలా లేక నా ప్రాణ స్నేహితురాలిని నా నుంచి దూరం చేసినందుకు దేవుడిని నిందించాలా ? అనేది తెలియడం లేదు. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను పావని. నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించలేవు.. నన్ను క్షమించు..మీ కుటుంబాన్ని ఇంత భయంకరమైన విషాదంలోకి నెట్టాను. ప్రతి క్షణం నిన్ను మిస్సవుతున్నాను. నేను బ్రతికి ఉన్నంత కాలం దోషిగానే ఉంటాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. నువ్వు నా దగ్గరకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను!! ఏదో ఒకరోజు మీ కుటుంబం నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను! నీతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.
ఈరోజు యాషిక ఆనంద్ పుట్టినరోజు. అయితే తను ఈ ఏడాది పుట్టిన రోజు జరుపుకోవడం లేదని.. అభిమానులు కూడా ఈ వేడుకలు నిర్వహించవద్దని కోరింది. పావని కుటుంబ సభ్యులకు శక్తినివ్వాలని ప్రార్థించండి. పావని మరణించడం నా జీవితంలో పూడ్చలేని లోటు. ఏదో ఒక రోజు నన్ను క్షమించు. నేను ఎప్పటికీ నిన్ను మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేసింది.
ట్వీట్..
Also Read: Mirabai Chanu: ఒలంపిక్స్‌లో మీరాబాయి చాను రికార్డ్.. వెండితెరపై మధ్య తరగతి మహిళ జీవితం..
Aishwarya Rai: ఐశ్యర్య రాయ్ చెల్లెనా ఏంటీ ? అచ్చం అలాగే ఉందిగా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న యువతి..