విజయ్‌ ‘సేతుపతి 2’ రంగం సిద్ధమా?

|

Mar 13, 2019 | 7:54 AM

కోడంబాక్కం: కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి స్టైలే డిఫరెంట్. పాత్ర నచ్చితే చాలు…వయసు, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా నటించేస్తుంటాడు సేతుపతి. అందుకే అతి వేగంగా 25 సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకున్నాడు. ఆయన నటించిన సినిమాలన్నీడిఫరెంట్‌గా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పిజ్జా, నడువుల కొంజం పక్కత్తకానోం, సూదుకవ్వుం, ఇదర్కుతానే ఆశపట్టాయ్‌ బాలకుమారా, సేతుపతి, విక్రంవేదా.. వంటి పలు చిత్రాలు విజయ్‌ సేతుపతికి బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. అంతేకాకుండా వీటి సీక్వెల్‌ చిత్రాల […]

విజయ్‌ ‘సేతుపతి 2’ రంగం సిద్ధమా?
Follow us on

కోడంబాక్కం: కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి స్టైలే డిఫరెంట్. పాత్ర నచ్చితే చాలు…వయసు, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా నటించేస్తుంటాడు సేతుపతి. అందుకే అతి వేగంగా 25 సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకున్నాడు. ఆయన నటించిన సినిమాలన్నీడిఫరెంట్‌గా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పిజ్జా, నడువుల కొంజం పక్కత్తకానోం, సూదుకవ్వుం, ఇదర్కుతానే ఆశపట్టాయ్‌ బాలకుమారా, సేతుపతి, విక్రంవేదా.. వంటి పలు చిత్రాలు విజయ్‌ సేతుపతికి బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. అంతేకాకుండా వీటి సీక్వెల్‌ చిత్రాల కోసం ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘ఇదక్కుతానే ఆశపట్టాయ్‌ బాలకుమారా’ సీక్వెల్‌లో నటించాలనే తన కోరికను ఇటీవల బయట పెట్టారు విజయ్‌ సేతుపతి.

అయితే వాటన్నింటికన్నా ముందుగా తొలిసారి ఓ పోలీసు అధికారిగా నటించిన ‘సేతుపతి’ సినిమా సీక్వెల్‌ మాత్రం తెరకెక్కనున్నట్లు తమిళ ఫిలిం వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలోని ఈ సినిమా రెండో భాగం చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. తొలి భాగం కన్నా పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా విజయ్‌సేతుపతి కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.