Prabhas Latest Movie: బాలీవుడ్ విలన్లని వద్దంటున్న ప్రభాస్..రీజన్ ఇదే.!

|

Feb 14, 2020 | 7:42 PM

Prabhas Latest Movie : ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఇప్పుడు అతని సినిమాలకు తెలుగుతో పాటు నేషన్ వైడ్‌ క్రేజ్ ఉంది. ఆ రేంజ్‌కి తగ్గట్టుగానే యంగ్ రెబల్ స్టార్ మూవీస్‌కి బడ్జెట్ సహా అన్ని అంశాలు మారిపోయాయి. అదే తరహాలో క్యాస్టింగ్ విషయంలో తన లాస్ట్ మూవీ ‘సాహో’ కోసం ఇతర బాషా నటులను ఆశ్రయించారు ఆ మూవీ మేకర్స్. ప్రజంట్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న తన తదుపరి […]

Prabhas Latest Movie: బాలీవుడ్ విలన్లని వద్దంటున్న ప్రభాస్..రీజన్ ఇదే.!
Follow us on

Prabhas Latest Movie : ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఇప్పుడు అతని సినిమాలకు తెలుగుతో పాటు నేషన్ వైడ్‌ క్రేజ్ ఉంది. ఆ రేంజ్‌కి తగ్గట్టుగానే యంగ్ రెబల్ స్టార్ మూవీస్‌కి బడ్జెట్ సహా అన్ని అంశాలు మారిపోయాయి. అదే తరహాలో క్యాస్టింగ్ విషయంలో తన లాస్ట్ మూవీ ‘సాహో’ కోసం ఇతర బాషా నటులను ఆశ్రయించారు ఆ మూవీ మేకర్స్. ప్రజంట్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న తన తదుపరి చిత్రంలో కూడా ఇదే ఫార్మాట్‌ను కొనసాగిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్.

ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా, భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కమెడియన్‌గా నటిస్తున్నారు. కానీ విలన్ విషయంలో ఈ సారి వెనక్కి తగ్గాడు ప్రభాస్. పర భాషా నటుల్ని తీసుకొచ్చిన సమయంలో రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చెయ్యడమే కాదు..సెట్స్‌లో తెలుగు డైలాగ్‌లు పలకడానికి కూడా వారు ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారట. మాములుగా హీరో, హీరోయిన్ తర్వాత విలన్‌కి మూవీలో ఎక్కువ లెంగ్త్ క్యారెక్టర్ ఉంటుంది . దీంతో టైమ్ వేస్ట్‌తో మనీ వేస్ట్‌ భారీగా జరుగుతోందట. అందుకే అటు బడ్జెట్ సేవ్ చెయ్యడానికి, ఇటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఇబ్బందులు తొలగించిడానికి..ఈ సారి తెలుగు స్టైలిష్ విలన్ జగపతిబాబును ఫైనల్ చేశారని తెలుస్తోంది.