
Nuvvu Leka Nenu Lenu Serial 2026 August 8th Episode Preview: నువ్వులేక నేనులేను సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ ట్విస్ట్‌లతో సాగుతుంది. ప్రియ తాగేసి సుందరి దొంగ చిట్టి అని చిట్టిలా నటించమని చెప్పింది మా అమ్మే అంటుంది. తాగిన మత్తులో ప్రియ నా మీద అభాండాలు వేస్తోంది దాని మాటలు నమ్మకండి బావగారు అని దమయంతి కవరింగ్ ఇస్తుంటుంది. నిజం నిప్పులాంటిది అమ్మా.. బ్యాంక్‌లో అప్పు.. అరచేతిలో నిప్పు ఎక్కువ సేపు ఉంచుకోకూడదు అంటుంది ప్రియ. ఏం జరుగుతుంది రా ఇంట్లో ..విక్రమ్‌తో రామచంద్ర అంటాడు. కాసేపట్లో తెలిసిపోతుంది మావయ్య అని విక్రమ్ అంటే.. కాసేపట్లో డీఎన్‌ఏ రిపోర్ట్ వస్తుందని చెప్పండి అని రాధ అంటుంది. డీఎన్‌ఏ రిపోర్ట్ ఏంట్రా అంటాడు రామచంద్ర. చిట్టి పై అనుమానంతో హెల్త్‌చెకప్ అని చెప్పి డీఎన్‌ఏ టెస్ట్ చేయించాను అంటాడు విక్రమ్. అంతలో రిపోర్ట్ వస్తుంది. చిట్టి రిపోర్ట్ తీసి చూసి షాకవుతాడు విక్రమ్. పాజిటివ్ రావడం చూసి నా కన్న కూతురు చిట్టి.. సుందరి కాదు అని మురిసిపోతాడు రామచంద్ర. రిపోర్ట్ మార్చేసిన దమయంతి ముసిముసినవ్వులు నవ్వుకుంటుంది.
ఈ రోజు నుంచి ఎవ్వరూ నా చిట్టిని అవమానించకూడదు. తనని అవమానిస్తే నన్ను అవమానించినట్టే అని రామచంద్ర అంటాడు. త్వరలోనే సుందరిని పైకి పంపించేస్తే దొంగ చిట్టిని తీసుకొచ్చిన పని కూడా పూర్తవుతుంది అని దమయంతి అనుకుంటుంది. విక్రమ్ చిట్టికి సారీ చెపుతాడు. ఆ రిపోర్ట్ అలా ఎలా మారింది అని సుందరి దమయంతితో అంటుంది. నేను రామచంద్ర కూతురినని రిపోర్ట్‌లో ఎలా వచ్చింది. నిజంగా నేను చిన్నప్పుడు తప్పిపోయి ఆ నాటకాల అమ్మానాన్నలకు దొరికానేమో అనిపిస్తుంది. ఈ ఇంటికి వారసురాలైన నేను ..స్టేజ్ మీద యువరాణి పాత్రలేసుకుంటూ ఇన్నాళ్లూ బతికేసాను. నిజం చెప్పండి.. కావాలంటే మీకు కొంత ఇస్తాను అంటుంది. ఏయ్.. ఆపు నీ పర్ఫామెన్స్ అంటుంది దమయంతి. నువ్వు మరీ అంత అతిగా ఆశపడకు. నవ్వు చిట్టివే అంటుంది. మరి ఆ రిపోర్ట్ ఎలా వచ్చింది మేడం మెడికల్ మిరాకిలా.. అది నేను చేసిన మ్యాజిక్ దమయంతి అంటుంది.
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరతారు. బావా అంటూ చిట్టి వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంటుంది. డీఎన్‌ఏ టెస్ట్‌లో చిట్టి ఒరిజినల్ అని తెలిసిన విక్రమ్ చిట్టిని ప్రేమగా పలకరించి దోశ వడ్డిస్తాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చోవడం చూసి అసూయపడుతుంది రాధ. చిట్టిని పంపించేయాలని ప్లాన్ వేస్తుంది. కూతురికి ఒక్క రోజే గోరుముద్దలు పెడతారా.. రోజూ పెట్టరా .. అని రామచంద్రాన్ని రెచ్చగొడుతుంది. రామ్మా నా పక్కన కూర్చో అని రామచంద్రం అంటాడు.. చిట్టి అయిష్టంగానే లేస్తుంది. తండ్రి పక్కన కూర్చుంటుంది. ఏవండీ ఇప్పుడు నేను పెట్టింది ఓకేనా అని రాధ విక్రమ్‌తో అంటుంది. నా దగ్గర నీ కటింగ్‌లు వద్దమ్మా.. నీవన్నీ పిల్ల చేష్టలు అంటాడు విక్రమ్. మీకు ఇచ్చిన డోస్ సరిపోలేదనుకుంటా.. ఇంకా ఇస్తాను అని విక్రమ్‌తో ఆడుకుంటుంది రాధ. బావగారు చిట్టికి పెళ్లి ఎప్పుడు చేస్తారు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతారు అని రాధ అందరి చేతా అడిగిస్తుంది.
చిట్టికి సంబంధాలు చూడమంటారా అని అంతా అడుగుతారు. నాటకం ఆడమని ఇంటికి తెచ్చి తనకు పెళ్లి చేసేస్తారా అని సుందరి షాకవుతుంది. ఎమోషనల్‌గా మారిపోయిన రామచంద్ర చిట్టికి పెళ్లి వద్దంటాడు. బతికిపోయాను అనుకుంటుంది సుందరి.ఇన్నేళ్ల తర్వాత ఇంటికొచ్చిన నా చిట్టితల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించను అంటాడు. మళ్లీ రాధ.. ఇల్లరికం అల్లుడ్ని తెచ్చుకుందాం అని ఐడియా ఇస్తుంది.
గురూజీ చిట్టి పెళ్లికి ఒప్పుకున్నారు కాబట్టి చిట్టికి పెళ్లయితే నేను విక్రమ్ భార్యగా సెటిలైపోవచ్చు అనుకుంటుంది రాధ. అందరి దృష్టిలో నాకు రాధకు పెళ్లయిపోయింది కాబట్టి చిట్టికి వేరే సంబంధం చూడాలి అనుకుంటున్నారు. ఎలాగోలా ఆ ఘోరాన్ని ఆపాలి అని విక్రమ్ ఆలోచనలో పడతాడు. రాధను ఎలాగైనా తప్పించాలని దమయంతి కన్నింగ్ ప్లాన్ వేస్తుంటుంది. అసలు చిట్టికి పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అమ్మమ్మ అంటుంది. చిట్టి ఏం మాట్లాడకుండా అక్కడ్నించి లేచి వెళ్లిపోతుంది. రామచంద్ర సహా అందరూ షాకవుతారు. పెళ్లి క్యాన్సిల్ అంటాడు విక్రమ్. అయితే రాధ కలగజేసుకుని చిట్టి సిగ్గుపడుతోంది అని కవరింగ్ ఇస్తుంది. అంతా నవ్వుతారు. ఇకపై నుంచి నాకు అనుకూలంగా సీన్ మార్చేసుకుంటా అని విక్రమ్‌తో అంటుంది రాధ. దాంతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. నువ్వు లేక నేను లేను” సీరియల్ ని ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో చూడొచ్చు. అలాగే టీవీలో ఎపిసోడ్‌ను మిస్ అయ్యారా? అయితే ఎప్పుడైనా JioHotstarలో చూసేయండి.