Jabardasth: అప్పుడు మార్కెట్‏లో కూరగాయలు అమ్మారు.. ఇప్పుడు జబర్దస్త్ షోలో తోపు కమెడియన్స్..

సినీ రంగంలో గుర్తింపు రావడం అంటే అంత సులభం కాదు. అలాగే బుల్లితెరపై తెరంగేట్రం చేయడం కూడా కష్టమే. కానీ ఎన్నో కష్టాలు, సవాళ్లు దాటుకుని ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసినవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ తారలకు సంబంధించిన పర్సనల్ విషయాలు.. ఇండస్ట్రీలోకి రాకముందు వారు చేసిన పని గురించి నెట్టింట వైరలవుతుంది.

Jabardasth: అప్పుడు మార్కెట్‏లో కూరగాయలు అమ్మారు.. ఇప్పుడు జబర్దస్త్ షోలో తోపు కమెడియన్స్..
Bhaskar, Gyaneshwar

Updated on: Jun 17, 2026 | 3:25 PM

సినీరంగంలో ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకున్న నటీనటులు ఒకప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అలాగే ప్రస్తుతం టీవీల్లో చాలా పాపులర్ అయిన నటులు సైతం ఒకప్పుడు కష్టాలుపడి వచ్చినవాళ్లే. ఇండస్ట్రీలోకి రాకముందు పలు రంగాల్లో కష్టపడి.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకున్నవారు ఇప్పుడు స్మాల్ స్క్రిన్ పై సక్సెస్ అయ్యారు. అలాగే జబర్దస్త్ కామెడీ షో సైతం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షోలో తమ కామెడీ టైమింగ్, నటనతో అలరిస్తున్న కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇద్దరు కమెడియన్స్ మాత్రం ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

ఆ ఇద్దరు మరెవరో కాదు.. భాస్కర్, జ్ఞానేశ్వర్. పటాస్ అనే టీవీ షో ద్వారా వీరిద్దరు బుల్లితెరపైకి అడుగుపెట్టారు. ఈ షో చూడటానికి స్టూడెంట్స్ గా వచ్చిన వీరిద్దరు తమ కామెడీ టైమింగ్ తో అక్కడున్న రచయితలు, దర్శకులను మెప్పించారు. దీంతో వీరికి నెమ్మదిగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నారు. గల్లీ భాస్కర్, జ్ఞానేశ్వర్ పుట్ట అనే స్క్రీన్ పేర్లతో ఫేమస్ అయ్యారు. పటాస్, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల వంటి షోలలో కనిపించారు.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు ఒకప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవాళ్లమని ఇటీవల ఓ షోలో చెప్పుకొచ్చారు. ఇద్దరం కలిసి పనిచేసేవాళ్లమని.. అలా ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ కామెడీ టైమింగ్ నటనతో అలరిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

గల్లీ భాస్కర్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

Follow Us