
జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్ గా, టీమ్ లీడర్స్ గా పనిచేసిన వారు ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కమెడియన్లుగా, నటీనటులుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతోనే బాగా పాపులర్ అయిన వారిలో మహిధర్ కూడా ఒకరు. జబర్దస్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అతను తర్వాత రైటర్ గా, టీమ్ లీడర్ గా ఎదిగాడు. అయితే ఎందుకో గానీ జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చేశాడు. మహీధర్ వైబ్స్’ పేరుతో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. సినిమాలు, బిగ్ బాస్ రివ్యూలు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇతని వీడియోలకు యూబ్యూబ్ లో భారీ వ్యూస్ వస్తుంటాయి. వీటితో పాటు ఓ కేఫ్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు మహీధర్. అయితే ఇప్పుడీ నటుడు ‘తన యూట్యూబ్ ఛానెల్ ను అమ్మేస్తున్నాను.. ఎవరైనా కొనండి’ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
‘ఇక మీదట మహీధర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఛానెల్ ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఛానల్ ఉండాలి అనుకుంటే మాత్రం మీ సపోర్టు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని నెలల క్రితం నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాను. అయితే ఈ బిజినెస్ లో రూ .55 లక్షల పైగా నష్టపోయాను. సుమారుగా రూ .65 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. కేవలం రూ .10 లక్షల రూపాయలు మాత్రమే మిగిలింది.. నేను దాచుకున్న రూ .40 లక్షల రూపాయలు ఈ బిజినెస్ లోనే పెట్టాను. అలాగే బయట నుంచి ఒక రూ.25 లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చి ఇన్వెస్ట్ మెంట్ చేశాను. కానీ మొత్తం మీద 60 లక్షల రూపాయల వరకు లాస్ అయ్యాను. ఇప్పుడు ఈ అప్పు తీర్చాల్సి వచ్చింది. నేను ఈ ఛానల్ ని అమ్మడానికి సిద్ధమయ్యాను.. కానీ వాళ్లు కొన్ని కండిషన్స్ పెట్టారు. అదే నన్ను ఈ వీడియో చేసేలా చేసింది. నేనే ఛానెల్ అమ్మేసి ఏదైనా పని చేసి సంపాదించాలనుకుంటున్నాను. పైగా నా ఛానెల్ కూడా మూవీస్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి ఛానెల్స్ ని కొంటూ ఉంటారు. వాళ్లు కూడా ముందుకు వచ్చారు. ఒక్క సబ్ స్క్రైబర్స్ కు రూ .4రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. ఇప్పుడు నాకు 10 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి 40 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడే ఓ మెలిక పెట్టారు’
‘ ఒకవేళ ఈ ఛానల్ అమ్మేస్తే పూర్తిగా ఇకమీదట మరో ఛానెల్ చేయడానికి వీలు ఉండకుండా కండిషన్ పెట్టారు. ముఖ్యంగా మూవీస్ రిలేటెడ్ గా ఏది మాట్లాడకూడదన్నారు. ఇక మీదట రివ్యూస్ కానీ మూవీస్ కి సంబంధించిన విషయాలని చేయకూడదని చెప్పారు. యూట్యూబ్ కొనేవాళ్లు ఈ రూల్స్ పెట్టేసరికి తనకి అర్థం కాక ఈ వీడియో చేశాను’ అని మహిధర్ చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.