Illu Illalu Pillalu August 7: వాళ్లు ప్రేమను తీసుకెళ్లిపోవడానికే వచ్చారు.. నర్మద మాటలకు షాకైన వేదవతి

Illu Illalu Pillalu August 7th Episode: స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఊహించని ట్విస్ట్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. రామరాజు, భద్రావతి కుటుంబాల మధ్య వైరం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇక ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్‌ 7వ తేదీ సాయంత్రం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో ఇప్పుడే తెలుసుకుందాం..

Illu Illalu Pillalu August 7: వాళ్లు ప్రేమను తీసుకెళ్లిపోవడానికే వచ్చారు.. నర్మద మాటలకు షాకైన వేదవతి
Illu Illalu Pillalu August 7th Episode
Image Credit source: JioHotstar

Edited By:

Updated on: Aug 07, 2026 | 4:10 PM

Illu Illalu Pillalu August 7th Episode Review: ప్రేమ, ధీరజ్‌ ఈ కొత్త జంట మధ్య ప్రేమ చిగురించకుండా చేసి పగను పెంచేస్తుంది భద్రావతి. తల్లి శారదాంబ పుట్టినరోజు పేరిట రామరాజు ఇంట్లో చేరి పచ్చని జంట మధ్య చిచ్చు రేపుతుంది. తాగి న్యూసెన్స్‌ చేసాడని ధీరజ్‌ని దూరం పెడుతుంది ప్రేమ. వీడు నా మొగుడే కాడు అని శారదాంబతో చెబుతుంది. ప్రేమ అలక తీర్చి ఆమెను ఎలాగైనా ఇంప్రెస్‌ చేసి తన కారులో ఎక్కించుకోవాలని కోచింగ్ సెంటర్ దగ్గరికి వస్తాడు ధీరజ్. ప్రేమ బుకింగ్‌ అతనికే పడుతుంది. మందు తాగి తను చేసిన భీభత్సానికి ప్రేమ దెయ్యం ఏ రేంజ్‌లో తనను కొట్టి చంపుతుందో అనుకుంటాడు ధీరజ్‌. అంతలో సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది ముగ్ధ. ప్రేమను ఉడికించడానికి ఇంత కన్నా మంచి చాన్స్‌ దొరకదని అనుకుంటాడు ధీరజ్‌. ముగ్ధతో ముగ్ధమనోహరంగా ఉన్నావు అంటాడు. ఫోన్‌ నెంబర్‌ షేర్‌ చేయబోతుంటే ప్రేమ అడ్డుకుంటుంది.

ప్రేమ ధీరజ్‌ను విడదీసింది భద్రావతే అని నర్మద వేదవతితో అంటుంది. ప్రేమ, ధీరజ్‌ పెళ్లి ఏ పరిస్థితిలో జరిగిందో వాళ్లకు తెలిసిపోయింది. అందుకే ప్రేమను తీసుకెళ్లడం కోసం శారదాంబ పుట్టిన రోజు వేడుక సాకుతో ఇన్నాళ్ల తర్వాత వచ్చి కావాలనే గొడవ పెట్టుకున్నారు అని నర్మద చెప్పడంతో వేదవతి షాకవుతుంది. ఇంటి ముందు ఆగిన కారులో ప్రేమ ధీరజ్‌ కలిసి దిగుతారు. వేదవతి సంతోషంతో పొంగిపోతుంది. భద్రావతి ప్రేమను రమ్మని చెప్పి డబ్బులు తీసి ధీరజ్ మొఖంపై విసిరికొడుతుంది.

ప్రస్తుతం తన పెళ్లాం భద్రావతి ఇంట్లో ఉంటోందని ధీరజ్‌ అంటాడు. అందుకని హాస్టల్ ఫీజ్ కింద డబ్బులు ఇస్తున్నానని డబ్బు తిరిగిచ్చేయడంతో భద్రావతి అవమానంగా ఫీలవుతుంది. మీ ఇద్దరు కలిసి వస్తే తనకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చావ్ అని చాలా సంతోషపడ్డాను కానీ నా బాధ మళ్లీ మొదటికే వచ్చింది అంటుంది వేదవతి. కారులోకి ఎక్కినంత ఈజీ కాదు నీ జీవితంలోకి అడుగుపెట్టడం అని ప్రేమ కోపంగా లోపలికి వెళ్లిపోతుంది. పిల్లల ప్రేమను అర్థం చేసుకోక వారిని విడగొట్టడానికి ఇంత కుట్ర చేస్తారా అని భద్రావతితో వేదవతి అంటుంది. అలా నేటి ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us