Illu Illalu Pillalu August 12th Episode: ప్రేమ జాకెట్‌ చింపేసిన ధీరజ్‌.. చెయ్యెత్తి కొట్టబోయిన సేనాపతి.. అల్లాడిపోయిన వేదవతి..

Illu Illalu Pillalu August 12th Episode Review: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈ రోజు ఆగస్ట్‌ 12వ తేదీ ఎపిసోడ్‌లో కథ కొత్త ట్విస్ట్‌తో సాగుతుంది. భర్త పేరు చెప్పకుండా కుంకుమ పెట్టించుకోకుండా ప్రేమ పొగరుగా ప్రవర్తిస్తుంది. భర్తకు అరిష్టం జరుగుంతుందని పూజారి హెచ్చరిస్తాడు. ధీరజ్‌కు గాయమై రక్తం కారుతుంది. తన వల్లే ఇలా జరిగిందని భయపడిన ప్రేమ అర్చన చేయిస్తుంది. పూర్తి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి.

Illu Illalu Pillalu August 12th Episode: ప్రేమ జాకెట్‌ చింపేసిన ధీరజ్‌.. చెయ్యెత్తి కొట్టబోయిన సేనాపతి.. అల్లాడిపోయిన వేదవతి..
Illu Illalu Pillalu
Image Credit source: JioHotstar

Edited By:

Updated on: Aug 12, 2026 | 11:52 AM

Illu Illalu Pillalu August 12th Episode Review: జ మధ్యలో లేచి వెళ్లిపోతుంది ప్రేమ. ప్రేమ వెనకాలే ధీరజ్‌ వస్తాడు. భర్త పేరు గోత్రం చెప్పనందుకు, ధీరజ్‌ చేత కుంకుమ పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకోనందుకు ప్రేమ కుమిలిపోతుంది. లేచిపోయావని అవమానించావు. ఆ బాధ మనసులో నీ మీదున్న ప్రేమని చంపేస్తోంది ధీరజ్‌ అని ప్రేమ ఏడుస్తుంది. మరోవైపు ప్రేమ తన మీద ఎందుకింత ద్వేషం పెంచుకుందని ధీరజ్ ఆలోచిస్తుంటాడు. ఓ భక్తుడు కళ్లు తిరిగి కింద పడబోతుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకుంటాడు ధీరజ్‌. ఆ క్షణం గుడిలో ప్రమాదం జరుగుతుంది. తాటాకు పై కప్పు భారీ శబ్దంతో నేరుగా ధీరజ్‌పై పడుతుంది. నుదుటికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. శుభమా అని గుడికొస్తే నీకిలా జరగడేంట్రా కొడుకుతో వేదవతి ఎమోషనల్‌ అవుతుంది. భర్త పేరు చెప్పకపోతే అశుభం .. కుంకుమ పెట్టించుకోకపోతే అరిష్టం .. పూజారి మాటలు గుర్తొచ్చి ప్రేమ భయపడిపోతుంది. నా భర్త పేరు మీద అర్చన చేయండి అని పంతుల్ని వేడుకుంటుంది. తప్పంతా నాదే క్షమించు తల్లీ నా భర్తకు ఏమీ కాకూడదు .. ధీరజ్‌పై ప్రేమను బయటపెడుతుంది ప్రేమ.

image credit JioHotstar

ఆగు ప్రేమా .. నా మాటలు నిన్నెంతగా బాధపెట్టాయో నా కర్థమైంది. అయితే ఎంత కోపం వస్తే నేనలా మాట్లాడానో అర్థం చేసుకో. మీనాన్న రెచ్చగొడితేనే మాట్లాడాననీ నువ్వు తెలుసుకోవాలి ప్రేమా అంటాడు .. నాకేం చెప్పొద్దు.. నీ సంజాయిషీ అవసరం లేదు అంటుంది. ఆ మాట అనకుండా ఉండాల్సింది. మనసు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏం చెప్పినా వినలేదు. నర్మద, వేదవతి ప్రేమకు సర్ది చెబుతారు. ఆ రోజు ధీరజ్‌ ఆ మాట అనాల్సి ఉండకూడదు. అసలు మీ వాళ్లు ఎందుకు మా ఇంటికొచ్చి గొడవ పెట్టుకున్నారో నువ్వు తెలుసుకోవాలి ప్రేమా. అమ్మ పుట్టిన రోజు వంక పెట్టుకుని వచ్చారు.. వేదవతి అంటే ప్రేమ మాట్లాడనివ్వదు. ఇప్పటికీ ఆ మాటలు గుర్తొచ్చి చచ్చిపోతున్నాను ఇంకా చంపకండి అంటుంది. సరే నువ్వు అర్థం చేసుకునే రోజు కోసం ఎదురుచూస్తుంటాను అంటాడు ధీరజ్‌.

ఇది నీకోసం నాన్న తెచ్చారు తీసుకో .. గోల్డ్‌ చైన్‌ ఇస్తాడు ధీరజ్‌. నాకొద్దు అంటూ ప్రేమ విసిరికొడుతుంది. ఘర్షణలో ప్రేమ బ్లౌజ్ చిరిగిపోతుంది. రామరాజు, వేదవతి, వల్లి షాకవుతారు. తప్పు చేసావు అంటూ ధీరజ్‌ వైపు కోపంగా చూస్తుంది .. చిరిగిన చోట కనిపించకుండా చేతిని అడ్డుపెట్టి అవమానంగా ఫీలవుతుంది. సేన చెయ్యెత్తి ధీరజ్‌ని కొట్టబోతాడు. భార్య మనసును అర్థం చేసుకుని ఎలా ప్రవర్తించాలో తెలిసి చావదారా నీకు … రామరాజు ధీరజ్‌ను కడిగిపారేస్తాడు. భద్రావతి సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. పర్ఫామెన్స్‌తో అదరగొడుతుంది. మొన్నటికి మొన్న ఎవడితోనో లేచిపోయిందని నరకం చూపించారు. ఇప్పుడేమో జాకెట్‌ చింపేసారు అంటుంది. ఇది భార్యా భర్తల విషయం వాడు క్షమాపణ చెప్పుకుంటాడు మధ్యలో జోక్యం చేసుకోకు వేదవతి అంటుంది.

image credit JioHotstar

ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకో బీభత్సం జరుగుతోంది .. ఈ దెబ్బతో ఆ పొట్టి మిరపకాయి ఇంకా ధీరజ్ శాశ్వతంగా విడిపోయినట్లే .. వల్లి ఫుల్ ఖుష్‌ అవుతుంటుంది. ఇంక ఆపుతారా? బర్స్ట్‌ అవుతాడు ధీరజ్‌. మీ అందరి కంటె ఎక్కువ ప్రేమించాను. తననెలా బాధపెట్టుకుంటాను ? జరిగింది మర్చిపోదాం ప్రేమా.. ఇంతకు ముందులా కలిసుందాం అంటాడు. నీకు నీ భర్త ఇల్లు ముఖ్యం అనుకుంటే సంతోషంగా వెళ్లిపో ప్రేమా నిన్ను మేం ఆపం అంటుంది భద్రావతి. సేన అడ్డుపడి .. మళ్లీ ఆ నరకంలోకి వెళ్లమంటావా అక్కా అంటాడు. నీకు కొందరి గురించి నిజాలు చెప్పాలి ..ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం రా ప్రేమా వేదవతి అంటుంది. ఆవేశంలో జరిగిన గొడవగా చూడాలే తప్ప మనసుల్ని దూరం చేసుకునే పరిస్థితి తీసుకురాకూడదు.. ప్రేమతో మామయ్య రామరాజు అంటాడు. ప్రేమ సమాధానం ఏంటి .. తను ఏం చెబుతుంది. ఈ రోజు ఆగస్ట్ 12 సాయంత్రం స్టార్‌మాలో ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో చూసేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us