Brahmamudi, April 30th episode: వావ్ వాటే సీన్.. కనకం కూతుళ్లా మజాకా.. అనామికకు ఇచ్చి పడేశారు!

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. అప్పూ, కళ్యాణ్‌లపై అనామిక కేసు పెట్టడంతో కనకం.. దుగ్గిరాల ఇంటికి వచ్చి.. బీభత్సం సృష్టిస్తుంది. నాకు న్యాయం జరిగే వరకూ.. అప్పూ ఇంటికి తిరిగి వచ్చే దాకా.. ఏం జరిగినా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. ఎలాంటి శక్తి కూడా నన్ను ఇక్కడి నుంచి కదిలించ లేదు. నా బిడ్డను క్షేమంగా నాకు అప్పగించాలి. అప్పటివరకూ కదిలేదు.. ఖబర్దార్ ధాన్య లక్ష్మి అని సవాల్ విసురుతుంది కనకం. కనకం చేతలకు ఎవరూ ఏమీ చేయలేక.. చూస్తూ ఉండి పోతారు. మరోవైపు అనామిక తల్లిదండ్రులు సుభ్రమణ్యం, శైలూలను..

Brahmamudi, April 30th episode: వావ్ వాటే సీన్.. కనకం కూతుళ్లా మజాకా.. అనామికకు ఇచ్చి పడేశారు!
Brahmamudi
Follow us

|

Updated on: Apr 30, 2024 | 12:32 PM

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. అప్పూ, కళ్యాణ్‌లపై అనామిక కేసు పెట్టడంతో కనకం.. దుగ్గిరాల ఇంటికి వచ్చి.. బీభత్సం సృష్టిస్తుంది. నాకు న్యాయం జరిగే వరకూ.. అప్పూ ఇంటికి తిరిగి వచ్చే దాకా.. ఏం జరిగినా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. ఎలాంటి శక్తి కూడా నన్ను ఇక్కడి నుంచి కదిలించ లేదు. నా బిడ్డను క్షేమంగా నాకు అప్పగించాలి. అప్పటివరకూ కదిలేదు.. ఖబర్దార్ ధాన్య లక్ష్మి అని సవాల్ విసురుతుంది కనకం. కనకం చేతలకు ఎవరూ ఏమీ చేయలేక.. చూస్తూ ఉండి పోతారు. మరోవైపు అనామిక తల్లిదండ్రులు సుభ్రమణ్యం, శైలూలను స్టేషన్‌కి పిలిపిస్తుంది కావ్య. కళ్యాణ్, అప్పూలను విడిపించమని చెబుతుంది. అయినా పట్టించుకోని అనామిక పేరెంట్స్.. నా కూతురికి ఎంత కష్టం వస్తే తప్ప పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుందని అంటాడు. మీ కూతురు కష్టానికి కారణాలు వెతుక్కుంటుంది. కావాలనే కాపురాన్ని కూలదోసుకుంటుందని కావ్య అంటుంది.

పట్టించుకోని అనామిక పేరెంట్స్..

అంటే మీ చెల్లెలి తప్పేం లేదంటావా.. అని శైలు అంటే లేదని కావ్య అంటుంది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులం మాత్రమే. అపార్థం చేసుకోకండి అని రాజ్ చెప్తాడు. నా కూతురు మీ ఇంట్లో సుఖంగా లేదు. కళ్యాణ్ అప్పూ మీద మోజుతో నా కూతుర్ని వదిలించు కోవాలని చూస్తున్నాడు. కోర్టుకు వెళ్తే తప్ప న్యాయం జరిగేలా లేదని సుబ్రమణ్యం అంటాడు. కోర్టు దాకా వెళ్తే ఎవరికి నష్టం చెప్పండి. మీ అమ్మాయి కాపురం గురించి ఆలోచించండి అని రాజ్ నచ్చచెప్పాలని చూస్తాడు. అప్పుడు కానీ అప్పూ పీడ విరగదవ్వదు. మా అల్లుడు కూడా దారికి వస్తాడు అని శైలు అంటుంది. దారికి రాడు.. జైలుకే వెళ్తాడు. తిరిగి వచ్చాక ఇంత చేసిన మీ కూతురితో కాపురం సరిగ్గా చేస్తాడు. మీ అమ్మాయిని మా ఇంట్లో ఉండనిస్తారా? అని కావ్య అంటే.. ఏంటి బెదిరిస్తున్నావా? మీ చెల్లితో కలిసి నాటకం ఆడిస్తున్నావా? మీ చెల్లితో కలిసి పెళ్లి చేయాలి అనుకుంటున్నావేమో అని శైలు అంటుంది.

అనామిక పేరెంట్స్‌కు దమ్కీ ఇచ్చిన కావ్య..

కళ్యాణ్‌కి నా చెల్లెలినే ఇచ్చి చేయాలి అనుకుంటే.. అసలు ఈ పెళ్లే జరిగి ఉండేది కాదే. అనామిక పెళ్లిలో అప్పుల వాడు వచ్చి.. పెళ్లి జరగనివ్వని గొడవ చేస్తే.. నేను వెళ్లి నా భర్తను తీసుకొచ్చాను. ఆయన రెండు కోట్లు కడితేనే మీ అమ్మాయి పెళ్లి జరిగిందని విషయం మర్చిపోయారా? వీళ్ల బతుకులు ఏంటో వీళ్లకు అర్థం అయ్యేలా చేస్తాను. అసలు అప్పుడే అప్పుల వాళ్లను రెచ్చగొట్టి.. మండపానికి పంపించి పెళ్లి ఆపించేదాన్ని. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేని మీరు మా గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? ఇప్పుడేంటి? మీ అమ్మాయిని ఈ కేసు వాపస్ తీసుకునేలా చేస్తారా? లేదా? ఈ స్టోరీ వెనుక మీ హస్తం కూడా ఉందా? అలాగే మీరు ఎవరికీ తెలీకుండా మా ఆయన దగ్గర తీసుకున్న రెండు కోట్ల విషయం కూడా అందరికీ తెలిసి పోతుంది. నా భర్త తలుచుకుంటే ఒక్క ఫోన్ కాల్ చాలు. మీరందరూ బయటకు వెళ్లి.. నా చెల్లి, మరిది బయటకు వస్తారు. కానీ మిమ్మల్ని ఎందుకు బతిమలాడుతున్నారు. మీ అమ్మాయితో కలిసి కాపురం చేయాలని చెబుతున్నారు. బీ కేర్ ఫుల్ అని అనామిక తల్లి దండ్రులకు గట్టి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆ క్లాస్ విన్న.. సుబ్రమణ్యం దిగొచ్చు కావ్యను బతిమలాడుతాడు. వెంటనే అనామికకు కాల్ చేస్తారు.

ఇవి కూడా చదవండి

కేసు వాపస్ తీసుకున్న అనామిక..

వచ్చి కేసు వాపస్ తీసుమని చెప్తారు. కానీ అనామిక వినదు. అనామికకు సర్ది చెప్పి.. పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్తారు అనామిక పేరెంట్స్. వెంటనే అనామిక వస్తుంది. కేసు వాపస్ తీసుకొందువు రా అని తల్లిదండ్రులు పిలిస్తే.. మీకేమన్నా మతి పోయిందా.. వాళ్లు మన కాళ్ల బేరానికి రావాలి కానీ.. మనంతట మనం దిగి రాకూడదు అనుకున్నాం కదా అని అనామిక అంటుంది. ఇప్పుడు నువ్వు రాకపోతే.. మన ముగ్గుర్ని లోపల వేయిస్తుందని నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్తారు. అనామిక లోపలికి వెళ్లే సరికి.. కళ్యాణ్ అప్పూకి టీ తీసుకొచ్చి ఇస్తాడు. అది చూసిన అనామిక.. నేను చచ్చినా ఈ కేసు వాపస్ తీసుకుని.. ఇక్కడ కూడా వీళ్ల రొమాన్స్ ఆపడం లేదు. నేను వెళ్లిపోతాను అని అంటుంది అనామిక. అప్పుడే కావ్య వచ్చి ఏంటి ఇక్కడే ఆగిపోయారు అని అడుగుతుంది. ఇక అనామిక చచ్చినట్టు వెళ్లి సర్.. నేను కేసు విత్ డ్రా చేసుకుంటున్నా అని చెప్తుంది. ఆ తర్వాత పోలీస్.. అనామిక వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు.

అక్కాచెల్లెల్లా మజాకానా.. కనకం విశ్వరూపం..

ఇంతలో రాజ్, కావ్య, కళ్యాణ్, అప్పూలు ఇంటికి వస్తారు. కావ్య వచ్చి అమ్మ ఏంటి అక్కా అలా కూర్చుంది అని కావ్య అడుగుతుంది. ఇంతసేపు ప్రతిఘటన, భారత నారి, వసేయ్ రాములమ్మా అనే సినిమాలు చూపించేసిందిలే అని రుద్రాణి అంటుంది. ఏయ్ కావ్యా.. ఇంత వరకూ మీ అమ్మ చేసిన గొడవ చాలు. ఇక వెళ్లమని చెప్పు అని ధాన్య లక్ష్మి అంటుంది. అలాగే చిన్న అత్తయ్యా.. అలాగే మీరు, మీ కోడలు, రుద్రాణి గారూ ఇంకోసారి అప్పూ మీద బురద చల్లాలి అని చూస్తే మాత్రం.. మా అమ్మ ఊరుకున్నా.. నేను ఊరుకోను. అది మీరంతా గుర్తు పెట్టుకోండి. నీ దాకా ఎందుకే.. నువ్వు నన్ను ఆపకుండా ఉంటే చాలు. మొత్తం నేను చూసుకుంటా అని స్వప్న అంటుంది. ఇక ఇక్కడితో ముగిస్తే చాలా మంచిది. లేదంటే నా విశ్వ రూపం చూపిస్తాను. మా కావ్య జీవితం గురించి కూడా ఈ ఇంటి పెద్దరికం పట్టించుకుంటుందని ఆశిస్తున్నా అని చెప్పి కనకం వెళ్తుంది.

కావ్య అమ్మవారు.. స్వప్న అపర కాళి.. అనామకురాలిగా అనామిక..

అయిపోయిందా అనామికా.. ఇంకా నువ్వు సాధించాల్సింది ఏమైనా ఉందా? ఇది నీ మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాం. మరోసారి జరిగితే అస్సలు సహించం అని పెద్దావిడ వార్నింగ్ ఇస్తుంది. అయినా మారని అనామిక.. మళ్లీ రాజ్ విషయం గురించి తీసుకొస్తుంది. దీంతో కావ్య ఆవేశంగా అనామికా.. నీ ఏడుపు నవ్వు ఏడు.. నీ కష్టం నువ్వు చెప్పుకో.. నీ కాపురం నువ్వు కూల్చుకో.. కానీ నా భర్త ప్రస్తావన లేవనెత్తితే మాత్రం నాలో నువ్వు మా అమ్మనే కాదు.. అమ్మవారిని కూడా చూస్తావ్ జాగ్రత్త.. అని వార్నింగ్ ఇస్తుంది. అరే కావ్యా నువ్వేలా ఇలా మాట్లాడేది? నువ్వు అమ్మవారి అయితే.. నేను అపర కాళిని అవుతా.. అనామికను అనామకురాలిని చేస్తా.. అని స్వప్న అంటుంది. జరిగింది చాలు.. నీ కోడల్ని లోపలికి వెళ్లమను చెప్పు ధాన్య లక్ష్మి అని సుభాష్ అంటాడు. అనామిక అన్నదాంట్లో తప్పేంటి? అన్నను కూడా అనురిస్తాడేమో అని భయ పడింది అది మనకు కూడా ఉండాలి కదా అని అపర్ణ అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ