ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న రాక కోసం రాహుల్, రుద్రాణిలు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మెల్లగా స్వప్న వస్తుంది. ఆగు.. ఎక్కడికి వెళ్లావ్? ఎక్కడి నుంచి వస్తున్నావ్ అని రాహుల్ గట్టిగా అరుస్తాడు. దీంతో ఇంట్లోని వాళ్లందరూ హాల్ లోకి వస్తారు. ఏంటి రాహుల్ ఎక్కడికి వెళ్తుంది.. పార్లర్ కి వెళ్తుందని నాతో చెప్పి వెళ్లిందని రుద్రాణి అంటుంది. మామ్ పార్లర్ కి వెళ్లి ఇప్పటిదాకా అక్కడే గడిపి వచ్చిందా.. నిజంగానే నువ్వు పార్లర్ కి వెళ్లావా అని రాహుల్ అడుగుతాడు. అప్పుడు కావ్య పార్లర్ కి వెళ్లిందని మీ అమ్మగారికి చెప్పింది కదా రాహుల్ అని అంటుంది. ఇది మా భార్యభర్తల గురించి సంబంధించిన విషయం కావ్య.. మీ భార్యాభర్తలకు సంబంధించిన ఎన్నో పంచాయితీలు ఈ ఇంట్లో జరిగినా.. నేను ఏనాడూ జోక్యం చేసుకోలేదని రాహుల్ అంటే.. నువ్వు జోక్యం చేసుకున్నా పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరు ఇక్కడ అని రాజ్ అంటాడు.
ఇది నన్న మోసం ఎవరితోనూ తిరుగుతుంది: రాహుల్
స్వప్న ఎక్కడికి వెళ్లిందో చెప్పే వెళ్లిందే కదా.. మరి ఏంటి నిలదీసి అడుగుతున్నావ్? అని రాజ్ అంటే.. అవునా రా.. నేను కూడా చెప్తున్నా కదా.. అసలు ఏం జరిగిందని రుద్రాణి కూడా ఏమీ తెలియనట్టు అడుగుతుంది. ఇది మిమ్మల్ని కాదు మామ్.. నన్ను మోసం చేసి ఎవరితోనో తిరుగుతుంది అని అంటాడు రాహుల్. ఆ మాటలకు ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు. ఇక ఇందిరా దేవి పళ్లు రాలగొడతా ఏం మాట్లాడుతున్నావ్ రా అని ఇందిరా దేవి అంటే.. భార్య బయటకు వెళ్లి కాస్త ఆలస్యంగా వస్తే ఇలాగేనా అర్థం చేసుకునేది అని అపర్ణ అంటుంది. రాహుల్ కొంచెం సంస్కారంతో మాట్లాడు అని కావ్య అంటుంది.
అంత పెద్ద నింద వేసినా.. ఎందుకు మౌనంగా ఉంది: రుద్రాణి
మీ అక్క ఇంత మౌనంగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు అంత మూగబోయి నుంచుంది. నా తరపున ఇందరు మాట్లాడుతున్నారు కదా.. వాళ్లకు తప్పుగా అనిపించనిది నీకెందుకు అనిపించింది. ఆలస్యంగా వస్తే అంత దారుణంగా మాట్లాడాలా.. లేట్ అయినందుకు సారీ మళ్లీ లేట్ చేయను.. ఈ సారి నువ్వే తీసుకెళ్లి తీసుకురా అని స్వప్న అంటుంది. ఇంత పద్దతిగా మాట్లాడుతున్నావ్.. తమలపాకుతో మేము ఇలా అంటే తలుపు చెక్కతో తల పగలకొడతా అనే నువ్వు నా కొడుకు అంత పెద్ద నింద వేస్తే లొంగిపోయినట్టు మాట్లాడుతున్నావ్ ఏంటి? అని రుద్రాణి అంటుంది. అంత పెద్ద మాట మీ అబ్బాయి ఎందుకు అనాలి? అంత పెద్ద తప్పు ఆ అమ్మాయి ఏం చేసిందని ధాన్య లక్ష్మి అంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు.
స్వప్న తప్పు చేసింది అందుకే ఆ నింద వేశాను: రాహుల్
నా భార్య అంత తప్పు చేసింది కాబట్టే.. నేను ఆ నింద వేశాను.. అని రాహుల్ అంటే.. ఏం చేసిందని కావ్య అడుతుంది. ఇదిగో తాత గారూ చూడండని ఇంట్లోని అందరికీ రాహుల్ తో కలిసి స్వప్న దిగిన ఫొటోలను పంచుతాడు. అది చూసిన అందరూ షాక్ అవుతారు. చూశారా తనతో ఆమె ఎంత చనువుగా ఉందో.. వాళ్లిద్దరి మధ్య ఏమీ లేదని మీరు నమ్ముతారా.. అని రాహుల్ అంటాడు. రాహుల్ అవన్నీ కాలేజ్ డేజ్ ఫొటోస్ వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్ అని అంటుంది. స్వప్న మాటలకు మొన్న అడిగితే తెలీదని చెప్పావ్ అని ఇందిరా దేవి అంటుంది. ఈ నిజం నీకు ముందే తెలిస్తే మాకు ముందే ఎందుకు చెప్పలేదు అమ్మా.. ఈ బాగోతం అంతా నీకు తెలిసి కూడా దాచి పెట్టావా.. నిజానిలేంటో తెలీకుండా ఆడపిల్లపై నింద వేయడం కరెక్ట్ కాదని ఊరుకున్నా.. కానీ తనుకూడా ఈ విషయాన్ని ఎందుకు దాచి పెట్టిందో అర్థం కావడం లేదు. నిజమే అమ్మమ్మ.. మీరు అడిగినప్పుడు నేను అబద్ధం చెప్పాను. ఎందుకంటే అప్పటికే నా కడుపు విషయంలో పెద్ద అబద్ధం జరిగింది. మళ్లీ ఎటు పోయి ఎటు వస్తుందో.. తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయి అబద్ధం చెప్పాను అంతే అని స్వప్న అంటుంది. అమ్మమ్మ గారూ ఇదో తింగరిది. ఎవరు ఏం అనుకుంటారో అస్సలు పట్టించుకోదు. అరుణ్ ని ఫ్రెండ్ లానే చూసింది. అరుణ్ నాకు కూడా తెలుసు. వాళ్ల పరిచయం అంత వరకే అమ్మమ్మా.. అని కావ్య అంటుంది.
అడ్డంగా బుక్ అయిన స్వప్న.. ఆడేసుకుంటున్న రాహుల్:
ఇది అక్కడితోనే ఆగిపోయిందా.. వాడిని నువ్వు కలవలేదా అని రాహుల్ అడుగుతాడు. లేదని స్వప్న అంటే.. మరి వాడిని ఇంటికి వరకూ ఎందుకు పిలిపించుకున్నావ్. కలిసి వాడితో మాట్లాడింది నేను చూడలేదు అనుకున్నావా అని రాహుల్ అడిగితే.. అవును ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ఇంటి వరకూ వచ్చాడు. స్వప్న వెళ్లి వాడిని కలిసి మాట్లాడింది నిజమే అని రాజ్ కూడా అంటాడు. జరగరా.. ఏంటి ఇదంతా.. నీ కోసం ఇంటి దాకా ఎందుకు వచ్చాడు. నీకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అయితే.. ఇంట్లోకి వచ్చి మాట్లాడొచ్చు కదా.. ప్రైవేట్ గా కలిసి ఎందుకు మాట్లాడాలి. నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తుందో నీకు తెలుస్తుందా.. అని రుద్రాణి అంటే.. అవును అత్తయ్యా వాడు ఇంటి దాకా వచ్చాడు. ఏదో మాట్లాడాలని బయటకు రమ్మన్నాడు.. మాట్లాడాను వెళ్లి పోయాడని స్వప్న అంటుంది. ఏ కారణంతో మీరు కలిసారు అని రుద్రాణి అడిగితే.. ఇదిగో ఇలాంటి కారణాలు అన్నీ పుట్టుకు వస్తాయనే.. వాడెవడో నాకు తెలీదని అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఇంత దారుణంగా దోషిని చేసి మాట్లాడుతున్నారు. మరి నువ్వు అరుణ్ కి డబ్బు ఎందుకు ఇచ్చావ్? అని వీడియో చూపిస్తాడు రాహుల్. డబ్బులు ఇవ్వడం ఏంటి రా.. ఇక్కడ ఈ దరిద్రం కూడా ఉందా? అని రుద్రాణి అంటుంది.
ఇది మామోలు ఆడది కాదు మామ్.. భయంకరమైన ఆడది:
ఇది మనం అనుకున్నంత తింగరిది ఏం కాదు మామ్.. భయంకరమైన ఆడది. కడుపు ఉందని సీమంతం వరకూ మెయిన్ టైన్ చేసిందంటే.. దీని గురించి మనం అందరం ఆలోచించాల్సిందే. తాతయ్య మాట కోసం క్షమిస్తే ఇప్పుడు ఇంతకు తెగించింది. రాహుల్ కొంచెం మర్యాదగా మాట్లాడు అని కావ్య అంటే.. ఏయ్ నువ్వు ఆగు ఎలాంటి ఆధారం లేకుండా నా కొడుకు మాట్లాడటం లేదు. మీ అక్క క్యారెక్టర్ ఏంటో అర్థమైందని రుద్రాణి అంటుంది. రుద్రాణి కావ్యని అనడం కాదు.. స్వప్న డబ్బులు ఇచ్చింది అనడానికి రాహుల్ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? అని ఇందిరా దేవి అంటే.. ఆ సాక్ష్యం ఉంది అమ్మమ్మ.. ఇప్పటి వరకూ నిజం చెప్తుందేమో అని వెయిట్ చేశాను. ఇదిగో చూడు అని స్వప్న.. అరుణ్ కి డబ్బులు ఇస్తున్న ఫొటోలు చూపిస్తాడు రాహుల్.
డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నిజం చెప్పు స్వప్నని అడిగిన ఇందిరా దేవి:
ఇక వీర లెవల్లో యాక్టింగ్ చేస్తూ.. ఎంత బరితెగించింది.. ఇది ఎలాంటి ఆడది.. దుగ్గిరాల వంశంలో ఎవరూ ఇలాంటి పనులు చేయలేదు. ఇంతగా దిగ జారి పోతుందా.. అసలు అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? ఖర్చులకు నేనే మా అమ్మ దగ్గరి నుంచి అడుక్కుంటాను. అలాంటిది ఈ ఇంట్లో నుంచి అంత డబ్బు ఎలా తీసుకెళ్లావ్ చెప్పు.. అని రుద్రాణి స్వప్నని నిలదీస్తుంది. నేను చెప్తాను మామ్.. ఇలా తాతయ్య ఇచ్చిన నగలు తాకట్టు పెట్టి ఇచ్చిందని పెద్దావిడకు చూపిస్తాడు. అసలు ఏం చేస్తున్నావ్ స్వప్న.. వాడి దగ్గరకు ఎందుకు వెళ్లావ్? నగలు ఎందుకు తాకట్టు పెట్టి డబ్బు ఇవ్వాల్సిన పని ఏంటి? మాకు ఏమీ అర్థం కావడం లేదు ఇప్పటికైనా నువ్వు మౌనంగానే ఉంటే.. ఇక్కడున్న వారందరూ నీ వ్యక్తిత్వాన్ని అనుమానించాల్సి వస్తుందని ఇందిరా దేవి అంటుంది. చెప్పు అక్కా.. వాడెవడు? నగలు ఎందుకు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చావ్? అని కావ్య అడుగుతుంది. ఏయ్ అంత సున్నితంగా అడిగితే అది ఎందుకు నిజం చెప్తుంది. అంతా అయిపోయింది. నా కోడలు నా కొడుకుని మోసం చేసింది. మొత్తం మన కుటుంబాన్ని మోసం చేసిందని రుద్రాణి అంటుంది.
ఇంట్లోని అందర్నీ ఓ ఆట ఆడుకున్న రుద్రాణి:
ఆపండి.. అని స్వప్న అంటే.. ఎందుకు ఇలా అరుస్తున్నావ్? సరే గతంలో నా కొడుకు మోసం చేశాడు. వాడిది తప్పని చెప్పి ఒప్పిస్తే తల వంచి తాళి కట్టాడు కదా.. అప్పుడైనా బుద్ధిగా కాపురం చేసుకోవాలి కదా.. ఇప్పుడేం చేసింది ఈ మాయలేడీ.. కడుపు లేకుండానే గర్బవతిగా నటిస్తూ.. ఇంత మందిని మోసం చేసినా నాన్న చెప్పిన మాటకు కట్టుబడి.. ఇంట్లో నుంచి గెంటేయలేదు. సాధించలేదే.. ఇప్పుడు ఈ చండాలం ఏంటి? దరిద్రం ఏంటి? నేను నోరు విప్పితూ.. తేనె టీగల్లా నా చుట్టూ ముసురుకుంటారు. ఇప్పుడెందుకు నోరు మూసుకుని అజంతా శిల్పాల్లా నుంచుండి పోయారు. ఆఖరికి అక్కని ఏదైనా అంటే.. రుద్రాణి గారూ అని అరిచే కావ్య కూడా నోరు మూసుకుని ఎందుకు నుంచుంది. అని చెడామడా వాయించేస్తుంది రుద్రాణి.
నేను మాత్రం ఏ తప్పూ చేయలేదు: స్వప్న
ఆల్ రైట్ అత్తయ్యా.. మీరు ఇలా తప్పుగా అపార్థం చేసుకోవడంలో అర్థం ఉంది. కానీ నేను మాత్రం ఏ తప్పూ చేయలేదు. అది వాడు అడ్వాన్ టేజ్ గా తీసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. కానీ రోగ్ నన్ను వదలడం లేదు. ఆ ఫొటోలు చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. డబ్బు ఇవ్వకపోతే ఇంకా నా గురించి మీతో చెడుగా చెప్తానని బెదిరించాడు.. అందుకే వెళ్లి డబ్బు ఇచ్చానని స్వప్న అంటుంది. ఇంత జరుగుతుంటే మాతో ఎందుకు చెప్పలేదని అపర్ణ నిలదీస్తుంది. ఎందుకు చెప్పలేదంటే తనకీ.. వాడికీ ఉన్న సంబంధం నిజం కాబట్టి.. వాడి కోసం సర్వస్వం దోచి పెట్టడానికి సిద్ధ పడింది కాబట్టి అని అంటాడు రాహుల్. అవకాశం దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు. నేను ఆలోచించే మాట్లాడతాను కానీ.. ఆలోచించకుండా తప్పటడుగు వేయనని స్వప్న అంటుంది. షటప్.. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఈ ఇంటి ఉప్పు తిని బ్రతికే వాళ్లు.. ఇంట్లో వాళ్లందర్నీ పిలిచి.. ప్రపంచంలో ఎవరు వచ్చి ఆపినా.. నేను ఆగను. ఇప్పుడే నేను దీన్ని గెంటేస్తాను ఎవ్వరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు అని అంటుంది రుద్రాణి.