బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న రియాల్టీ షో బిగ్‌బాస్. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు నడిచే ఈ రియాల్టీ షో గురించి నిత్యం ఏదోక న్యూస్ నెట్టింట వైరలవుతుంటుంది. ఇక ఇందులోకి ఎంటరయ్యే పోటీదారుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుండగా.. త్వరలోనే తెలుగులో సీజన్ 8 స్టార్ట్ కానుంది.
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు విపరీతమైన అభిమానులు ఉంటారు. గతంలో ఒకరి ఫ్యాన్స్ ఒకరిపై దాడికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బిగ్‌బాస్ విజేతపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 8 రాబోతుంది. ఈసారి ఈ షోను కాస్త ముందుగానే ప్రారంభించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 4న బిగ్‌బాస్ సీజన్8 స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అలాగే ఈసారి షోలో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
కుమారి ఆంటీతోపాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క, అమృత ప్రణయ్, అలాగే యూట్యూబర్ నేత్ర, మోటివేషనల్ స్పికర్ వంశీ బిగ్‌బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మమూడి ఫేమ్ కావ్య కూడా ఈ సారి హౌస్ లోకి రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.