బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో ఈ షో ముగియనుంది.
ఇక వచ్చేవారమంతా హౌస్ లో ఫినాలే వీక్ జరగనుంది. ఇందుకు టాప్-5 కంటెస్టెంట్స్ మాత్రమే అర్హులు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పనిసరైపోయింది ఇందులో భాగంగా శనివారం (డిసెంబర్ 08) నాటి ఎపిసోడ్ లో జబర్దస్త్ కమెడియన్ రోహిణీని ఎలిమినేట్ చేశారు. టాప్-5 కచ్చితంగా ఉంటుందనుకున్న రోహిణీ అనూహ్యంగా బయటకు రావడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ తన ఆట, మాట తీరుతో అందరి మన్ననలు గెల్చుకుంది రోహిణి. అంతేకాదు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. గతంలోనే బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చిన రోహిణీ ఎనిమిదో సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది. ఓ వైపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఓటింగ్ లోనూ సత్తా చాటింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి దాపరించింది.
ఇక బిగ్ బాస్ 8వ సీజన్లో రోహిణి దాదాపు 9 వారాల పాటు ఉంది. కాగా హౌసులోకి వచ్చేముందే వారానికి రూ.2లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె సుమారు రూ.18 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
కాగా తన మాటలు, నటనతో ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తే రోహిణీ గతంలో నూ బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొంది. మూడో సీజన్ మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. అయితే పెద్దగా రెమ్యునరేషన్ అందుకోలేదు. ఈసారి మాత్రం ఆమె భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.