
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం ముగిసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరొక కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఈ వారం నయని పావని ఎలిమినేట్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా మెహ బూబ్ దిల్ సే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఎనిమిదో వారంలో మొత్తం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో నయని పావని, మెహబూబ్ లకు తక్కువ ఓట్లు పడ్డాయి. అయితే నాగార్జున నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో మెహబూబ్ నిరాశగా బయటకు వచ్చాడు. కాగా ఎలిమినేషన్ అనంతరం మెహబూబ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు..
‘‘ఇంతకుముందు దీపావళి సమయంలోనే నేను ఎలిమినేట్ అయ్యా. ఇప్పుడు కూడా అదే పండగ వేళ ఎలిమినేట్ అయ్యాను. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడంలేదు. ప్రతి టాస్క్‌లోనూ నా బెస్ట్ ఇవ్వాలనే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను. కానీ, దురదృష్టవశాత్తూ బయటకు వచ్చేశాను’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు మెహబూబ్.
కాగా గతంలో బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా వచ్చాడు మెహబూబ్. అప్పుడు కూడా విజేతగా నిలవలేకపోయాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్ లోనూ వైల్డ్‌కార్డ్‌తో కొత్త సీజన్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు హౌస్‌మేట్స్‌ను టపాసులతో పోల్చుతూ మెహబూబ్ వారితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.