Shobha Shetty: ‘కార్తీక దీపం’ మోనితకు అవార్డ్.. శోభాశెట్టిని వరించిన ‘రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్’..

|

Dec 27, 2023 | 10:10 AM

టెలివిజన్‏లో సెన్సెషన్ అయిన కార్తీక దీపం సీరియల్లో లేడీ విలన్ మోనితగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నందుకు ఆమెకు ఈ అవార్డ్ వచ్చింది. గత ఐదేళ్లుగా ఈ అవార్డుల వేడుకలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వాళ్లకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ లీడర్, పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. మోనిత పాత్రకు తనకు ఈ అవార్డ్ వచ్చిందని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది శోభా.

Shobha Shetty: కార్తీక దీపం మోనితకు అవార్డ్.. శోభాశెట్టిని వరించిన రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్..
Shobha Shetty
Follow us on

శోభాశెట్టి.. మొన్నటివరకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపించిన పేరు. కన్నడ అమ్మాయి అయినా.. తెలుగు ప్రేక్షకులకు మోనితగా దగ్గరయ్యింది. లేడీ విలన్‏గా తన అద్భుతమైన నటనతో అదరగొట్టేసింది. బుల్లితెరపై మోనితగా విలనిజం చూపించిన శోభా.. ఇటీవల బిగ్‏బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టి.. పూర్తిగా నెగిటివిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శోభా ‘రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్’ అందుకుంది. టెలివిజన్‏లో సెన్సెషన్ అయిన కార్తీక దీపం సీరియల్లో లేడీ విలన్ మోనితగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నందుకు ఆమెకు ఈ అవార్డ్ వచ్చింది. గత ఐదేళ్లుగా ఈ అవార్డుల వేడుకలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వాళ్లకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ లీడర్, పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. మోనిత పాత్రకు తనకు ఈ అవార్డ్ వచ్చిందని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది శోభా.

“కార్తీకదీపం మోనిత క్యారెక్టర్‌కి బెస్ట్ నెగటివ్‌గా రాష్ట్రీయ గౌరవ్ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ విజయవంతమైన ప్రయాణంలో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ యూ సో మచ్ గర్ల్స్.” అంటూ తన సంతోషాన్ని తెలియజేసింది శోభా. దీంతో ఆమెకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజానికి కార్తీకదీపం సీరియల్ ద్వారా శోభాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో మోనిత పాత్రలో లేడీ విలన్‏గా అదుర్స్ అనిపించుకుంది. అప్పటివరకు విలనిజం చూపించిన మోనితా.. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇక కార్తీకదీపం క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టింది. హౌస్ లోకి ఎంటర్ అవుతూ.. ఇప్పటివరకు తానూ కార్తీక దీపం మోనితగానే అందరికీ తెలుసు అని.. ఇప్పుడు రియల్ శోభాశెట్టిని చూపిస్తానంటూ చెప్పుకొచ్చింది. కానీ సీరియల్ బ్యాచ్‏తో కలిసి ఆమె ఆడిన ఆటతీరు.. ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడంతో ఆమెపై పూర్తిగా నెగిటివిటీ ఏర్పడింది. ముఖ్యంగా శివాజీ, యావర్‏తో మోనితా ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె 14వ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.