Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ పాస్ గెలిచిన రైతుబిడ్డ.. సంబరపడిపోయిన శివాజీ.. యావర్ నువ్వు సూపర్..

|

Nov 22, 2023 | 6:57 AM

ఎవిక్షన్ పాస్ టాస్కులో యావర్ ను నన్ను ఫౌల్ చేస్తుంటే చూశామని చెప్పావ్.. మా ఇద్దరినీ చూసినప్పుడు ప్రియాంకను ఎలా చూశావ్ ఒకేసారి అని అడిగాడు. అక్కడున్న నలుగురు చెప్పారు అని గౌతమ్ అనగా.. నామినేషన్ వేసింది నువ్వే కదా.. నువ్వే చెప్పు అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ చెల్లి, అన్న అనే సంబంధాలు లేవు కదా.. అలాగే గేమ్ లో ఫౌల్ అయితే సంచాలక్ చూసుకుంటాడు. నీకెందుకు అంటూ మరో ప్రశ్న వేశాడు. ఒక అడియన్ గా చెప్పానంటూ గౌతమ్ ఆన్సర్ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ పాస్ గెలిచిన రైతుబిడ్డ.. సంబరపడిపోయిన శివాజీ.. యావర్ నువ్వు సూపర్..
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7 పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈ వారం ప్రియాంక, శోభా మినహా అందరూ నామినేట్ అయ్యాడు. అయితే సోమవారం ఎపిసోడ్ లో ప్రశాంత్ వర్సెస్ గౌతమ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. డాక్టర్ బాబు కోపానికి.. రైతు బిడ్డ కౌంటర్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ వర్సెస్ రతిక, అమర్ వర్సె్స్ యావర్, రతిక ఇలా ఎక్కువగానే వాదనలు జరిగాయి. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో శివాజీ, ప్రియాంక, గౌతమ్ మధ్య పెద్ద చర్చే జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీ గౌతమ్ ను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ టాస్కులో యావర్ ను నన్ను ఫౌల్ చేస్తుంటే చూశామని చెప్పావ్.. మా ఇద్దరినీ చూసినప్పుడు ప్రియాంకను ఎలా చూశావ్ ఒకేసారి అని అడిగాడు. అక్కడున్న నలుగురు చెప్పారు అని గౌతమ్ అనగా.. నామినేషన్ వేసింది నువ్వే కదా.. నువ్వే చెప్పు అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ చెల్లి, అన్న అనే సంబంధాలు లేవు కదా.. అలాగే గేమ్ లో ఫౌల్ అయితే సంచాలక్ చూసుకుంటాడు. నీకెందుకు అంటూ మరో ప్రశ్న వేశాడు. ఒక అడియన్ గా చెప్పానంటూ గౌతమ్ ఆన్సర్ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అశ్వినినీ నామినేట్ చేయగా.. ఆమె సెల్ఫ్ నామినేట్ కావడంతో.. అర్జున్ ను నామినేట్ చేశాడు.

ఇక తర్వాత శోభా.. శివాజీ, అర్జున్ ను నామినేట్ చేసింది. అలాగే ప్రియాంక.. యావర్, శివాజీలను నామినేట్ చేసింది. అయితే ప్రియాంక ప్రశ్నలకు యావర్ గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక, శివాజీ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. నీ రంగులు నాకు తెలుసు.. చాలా చూశాను.. అంటూ వెళ్లి కూర్చున్నాడు శివాజీ. హౌస్ లో ఏముకుంటున్నారో అదే చేస్తారు అని శివాజీ అనడంతో ఏం అనుకుంటున్నామంటూ అడిగింది ప్రియాంక. దీంతో ఆమెకు ఆన్సర్ ఇవ్వకుండా సైడ్ అయ్యాడు శివాజీ. ఇక నామినేషన్స్ తర్వాత ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్‏బాస్. ఇందుకోసం బ్యాలెన్సింగ్ రాడ్ ఇచ్చి.. దాని ఎండో ఒక చేత్తో పట్టుకుని మిగిలిన మరో చెత్తో ఒక్కో వస్తువు దానిపై పెట్టి పడకుండా చూసుకోవాలి. చివరి వరకు ఎవరు బ్యాలెన్స్ చేస్తారో వాళ్లే విన్నర్ అని చెప్పాడు బిగ్‏బాస్. ఇందులో మొదట శోభా, శివాజీ, రతిక, గౌతమ్, అమర్, అర్జున్, అశ్విని వరుసగా ఔట్ కాగా.. చివరకు ప్రియాంక, ప్రశాంత్ మాత్రమే మిగిలారు. ఇక తర్వాత ప్రియాంక ఔట్ కావడంతో ఎవిక్షన్ పాస్ రైతుబిడ్డకు దక్కింది. దీంతో వెంటనే శివాజీని ప్రశాంత్ ను హగ్ చేసుకుని తెగ సంతోషపడిపోయాడు.

నా నమ్మకం నిలబెట్టావ్.. ఎవరి గురించి పట్టించుకోకు అంటూ చెప్పుకోచ్చాడు శివాజీ. శివాజీ లెటర్ ఇవ్వడం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఇక తర్వాత ఎవిక్షన్ పాస్ గురించి శివాజీ, యావర్, ప్రశాంత్ మధ్య చర్చ జరిగింది. ఎవిక్షన్ పాస్ ఒకవేళ అన్నకు వాడాలంటే వాడు.. కానీ నా కోసం వద్దు అంటూ యావర్ చెప్పాడు.