Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న అందాల యాంకరమ్మ.. ఇక అసలైన రచ్చ అప్పుడే..

| Edited By: Rajeev Rayala

Sep 12, 2021 | 5:01 PM

బిగ్‏బాస్ సీజన్ 5 ప్రారంభమైన రెండో రోజు నుంచే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే కలిసి కట్టుగా ఉన్న సభ్యులు.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న అందాల యాంకరమ్మ.. ఇక అసలైన రచ్చ అప్పుడే..
Bigg Boss
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 5 ప్రారంభమైన రెండో రోజు నుంచే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే కలిసి కట్టుగా ఉన్న సభ్యులు.. ఇప్పుడు గ్రూపులుగా విడిపోయారు. చిన్న చిన్న సమస్యలు, కారణాలతో గొడవలు మొదలయ్యిన తారాస్థాయికి చేరుతున్నాయి. యాథావిధిగా బిగ్‏బాస్ చిచ్చు పెట్టకముందే ఇంటి సభ్యులే మనస్పర్థలు పెంచుకుంటూ.. నానా రచ్చ చేస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. ఇక బిగ్ బాస్ ప్రారంభమై… వారం రోజులు కావోస్తుంది. ఈరోజు లేదా రేపు.. ఒక కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు రానున్నారు. అయితే ఈసారి ఎన్నడు లేనివిధంగా.. ఒకేసారి 19 మంది కంటెస్టెంట్స్‏ను హౌస్‏లోకి పంపి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై సందేహాలను కలిగించాడు బిగ్ బాస్. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఈషో నుంచి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.

ఈ సీజన్‏లో పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జనాల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారిని తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందులో భాగంగా.. ఆసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బుల్లితెరపై టాప్ యాంకర్స్‏లలో ఒకరైన వర్షిణీ రాబోతున్నట్లుగా టాక్. అటు పలు షోలలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తుంది వర్షిణి. భారీ ఫాలోయింగ్ ఉన్న వర్షిణి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే.. అసలైన రచ్చ అప్పుడే అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ వారం సరయు ఎలిమినేట్ కాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు

Sai Dharam Tej Bikes: సాయి ధరమ్ తేజ్‌ బైక్ లవర్.. మెగా హీరో గ్యారేజ్‌లో మరిన్ని సూపర్‌ బైక్స్‌

Sai Dharam Tej in ICU: ఐసీయూలో తేజు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న జూ. ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ, సినీ నటీనటులు