Bigg Boss 10 Telugu : పది కేజీల స్వీట్స్ తింటాను సర్.. కానీ 8 రోజులుగా మానేశాను.. అందుకే ఇలా.. బయట వస్తూ ఏడిపించిన కృష్ణుడు..

రెండో వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చాడు కృష్ణుడు. ముందు నుంచి ఈసారి ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో లీక్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే హౌస్ లో ఉన్నంతకాలం ట్రోల్స్ ఎదుర్కొన్న కృష్ణుడు ఎలిమినేట్ అవుతూ అందరిని ఏడిపించేశాడు. ముఖ్యంగా తనకున్న ఆరోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చాడు. దీంతో రెండు నెలల్లో పూర్తిగా మారిపోవాలని అన్నారు నాగార్జున.

Bigg Boss 10 Telugu : పది కేజీల స్వీట్స్ తింటాను సర్.. కానీ 8 రోజులుగా మానేశాను.. అందుకే ఇలా.. బయట వస్తూ ఏడిపించిన కృష్ణుడు..
Bigg Boss 10 Telugu

Updated on: Sep 21, 2026 | 6:40 AM

బిగ్ బాస్ సీజన్ 10 రెండో వారం ఎలిమినేషన్ సైతం పూర్తైంది. అందరూ అనుకున్నట్లుగానే ఆదివారం నాటి ఎపిసోడ్ లో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు. చివరి రౌండ్ లో సృష్టి, కృష్ణుడు మాత్రమే ఉండగా.. వీరిద్దరిలో కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక బయటకు వస్తూ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చారు కృష్ణుడు. ఎలిమినేషన్ ప్రకటన అనంతరం కృష్ణుడు హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “నేను హౌస్‌లో సరిగ్గా ఆడలేకపోయాను, దాన్ని ఒప్పుకుంటాను. దానికి నాకేం బాధలేదు, చాలా హ్యాపీగా ఉన్నాను” అని చెప్పారు. తొలి వారంలో గొడవపడిన రోహిత్, కృష్ణుడు వెళ్లిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు. “మీ కళ్లు మా నాన్నగారి కళ్లలాగే ఉంటాయి” అంటూ రోహిత్ ఏడవడంతో, కృష్ణుడు కూడా స్పందిస్తూ “కోపంలో కంట్రోల్ చేసుకోలేకపోయాను, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను” అని క్షమాపణలు చెప్పారు. త్రిగుణ్ కూడా కృష్ణుడిని పట్టుకుని ఏడ్చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

స్టేజ్‌పైకి వచ్చిన కృష్ణుడికి నాగార్జున గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. బిగ్‌బాస్ అనుభవంపై కృష్ణుడు స్పందిస్తూ.. డిఫరెంట్ మెంటాలిటీలు ఉన్న వ్యక్తులతో ఉండటం వల్ల లైఫ్ ఏంటో అర్థమైందని చెప్పారు. అనంతరం ఆయన జర్నీ వీడియోను నాగార్జున చూపించారు. తర్వాత నాగార్జున ఆదేశాల మేరకు కృష్ణుడు ఇంట్లోని నలుగురు పాజిటివ్, నలుగురు నెగిటివ్ కంటెస్టెంట్లను వర్గీకరించారు. దేబ్జానీ, ఝాన్సీ, సృష్టి, అమన్ పాజిటివ్ అని.. సుధీర్, ముకేష్, వర్షిణి, చరణ్ నెగిటివ్ అని అన్నారు. నెగిటివ్ పీపుల్ అని ఎందుకు అన్నారంటే, వారు గేమ్‌లో మనస్ఫూర్తిగా లేరని, విష్ చేసినా హాఫ్ స్మైల్ ఇచ్చారని కృష్ణుడు వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

తన ఎలిమినేషన్‌కు గల ప్రధాన కారణాన్ని కృష్ణుడు వెల్లడించారు. గత 8 రోజులుగా స్వీట్లు, షుగర్ తినడం పూర్తిగా మానేయడం వల్ల శరీరం తీవ్రంగా నీరసించిందని చెప్పారు. రోజుకు పది కేజీల స్వీట్లు తినే అలవాటు ఉన్న తనకు సడెన్‌గా షుగర్ బంద్ చేయడం వల్ల హెల్త్ రివర్స్ అయి గేమ్‌పై ప్రభావం చూపిందని తెలిపారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ, బయటకు వెళ్లాక రెండు నెలల్లో మెల్లమెల్లగా పంచదార వాడకం తగ్గించాలని సూచిస్తూ కృష్ణుడికి వీడ్కోలు పలికారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Loading...
Unable to load recommendations.
Follow Us