
ఇటీవల జియోహాట్‌స్టార్‌లో జరిగిన ‘బిగ్‌బాస్ తెలుగు 24/7 లైవ్ చాట్’లో మాజీ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి సెలబ్రిటీలకు బహిరంగంగా మద్దతు తెలిపాడు. తన ఫేవరెట్ కంటెస్టెంట్లలో దేబ్‌జానీ, రామ్ ప్రసాద్, నరేష్ పేర్లను ప్రస్తావించిన మానస్, ప్రస్తుతం రామ్ ప్రసాద్‌కు ఓటు వేస్తున్నానని చెప్పాడు. అంతేకాదు, తాను సెలబ్రిటీలకే మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశాడు. మానస్ వ్యాఖ్యలతో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ చర్చ మరింత వేడెక్కింది. హౌస్ బయట సెలబ్రిటీ కంటెస్టెంట్లకు తెలిసినవారి నుంచి వరుసగా మద్దతు లభిస్తుండగా, కామనర్స్ మాత్రం ఒంటరిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న ఒత్తిడితో వారు తమలో తాము ముడుచుకుపోతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
సెలబ్రిటీలు తమవారికే మద్దతు ఇస్తూ కామనర్స్‌ను ఒంటరి పోరాటానికి వదిలేస్తున్నారా? లేక అండర్‌డాగ్స్‌గా కనిపిస్తున్న కామనర్స్ ఒక్కసారిగా పుంజుకొని ఆటను మలుపు తిప్పుతారా? ఈ విభజన మరింత స్పష్టమవుతున్న నేపథ్యంలో ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ ఈ సీజన్‌లోనే అతిపెద్ద పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హౌస్ లో సైతం కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అన్నట్లుగానే షో సాగుతుంది. మొదటి రోజు నుంచే అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ పై మాటల దాడి చేస్తున్నాడు త్రిగుణ్. గిన్నెలు సరిగ్గా కడగడం లేదని మాటి మాటికి పిలుస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అనే చర్చ మరింత హీటెక్కింది.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..