AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇదెక్కడి సినిమా.. మొత్తం ప్లాప్ అన్నారు.. కానీ బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఇండస్ట్రీలోనే సంచలనం..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు చాలా ఉన్నాయి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా.. అప్పట్లో ప్లాప్ అన్నారు. కానీ మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఇంతకీ ఏ సినిమా అంటే.

Tollywood : ఇదెక్కడి సినిమా.. మొత్తం ప్లాప్ అన్నారు.. కానీ బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఇండస్ట్రీలోనే సంచలనం..
Anveshana Movie
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2026 | 12:59 PM

Share

తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయిన అత్యుత్తమ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘అన్వేషణ’ ఒకటి. దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం, విడుదలైన సమయం నుండి నేటి వరకు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉంది. సినీ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు ఈ సినిమా వెనుక ఉన్న అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మంచుపల్లకి, సితార వంటి విజయాల తర్వాత వంశీ గారు ఒక సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తీయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణ గారి ‘అవే కళ్ళు’ సినిమా మరియు కన్నడలోని ‘అపరిచిత’ చిత్రం ఆయనపై ఎంతో ప్రభావం చూపాయి. అడవి నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠభరిత కథను రాసుకుని, దానికి ‘అన్వేషణ’ అని పేరు పెట్టారు. అరకు అడవుల్లో ప్రశాంత వాతావరణంలో కూర్చుని వంశీ గారు ఈ చిత్ర స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో భానుప్రియ కథానాయికగా నటించగా, కార్తీక్ కథానాయకుడిగా నటించారు.

కార్తీక్ కాంబినేషన్ కుదిరాక, షూటింగ్ ఎక్కువ భాగం తలకోన అడవుల్లో జరిగింది. తలకోన ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, శరత్ బాబు, రాళ్లపల్లి, మల్లికార్జున రావు (పులిరాజు పాత్ర) వంటి నటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమా ముగిసేవరకు హంతకుడు ఎవరనేది ప్రేక్షకుడికి చిక్కకుండా వంశీ గారు అద్భుతమైన స్క్రీన్‌ప్లే అందించారు. ఇక ఈ సినిమా విజయానికి ప్రధాన బలం ఇళయరాజా గారి సంగీతం, ఎం.వి. రఘు గారి ఛాయాగ్రహణం. అడవిలోని భయానక వాతావరణాన్ని, సన్నివేశాల తీవ్రతను పెంచడంలో ఇళయరాజా గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కీలక పాత్ర పోషించింది.

హాలీవుడ్ స్థాయిలో రీ-రికార్డింగ్ ఇచ్చారని ఇళయరాజా గారే స్వయంగా ప్రశంసించారు. “కీరవాణి”, “ఎదలో కలిసే”, “ఏకాంత వేళ” వంటి పాటలు వేటూరు గారి సాహిత్యం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి గారల గాత్రంతో ఆబాలగోపాలాన్ని అలరించాయి. మొదట్లో ప్రివ్యూ చూసిన కొందరు ప్రముఖులు భిన్నంగా స్పందించినప్పటికీ, థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుంచే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సాంకేతికంగానూ, కథాపరంగానూ తెలుగు చిత్రసీమలో ‘అన్వేషణ’ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us