హాసినీ రీ ఎంట్రీ.. ఆ ఇద్దరి బడా హీరోలతో!

తన చలాకీతనంతో అందరి దృష్టినీ ఆకర్షించిన హీరోయిన్ జెనీలియా. హా.. హా.. హాసినీ అంటూ బొమ్మరిల్లులో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా.. బొమ్మరిల్లు హాసినిగానే..

హాసినీ రీ ఎంట్రీ.. ఆ ఇద్దరి బడా హీరోలతో!

Edited By:

Updated on: May 21, 2020 | 12:35 PM

తన చలాకీతనంతో అందరి దృష్టినీ ఆకర్షించిన హీరోయిన్ జెనీలియా. హా.. హా.. హాసినీ అంటూ బొమ్మరిల్లులో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా.. బొమ్మరిల్లు హాసినిగానే అందరికీ గుర్తిండిపోయింది. అయితే పెళ్లి అయిన అనంతరం ఈ భామ నటనకు దూరంగా ఉంది. త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఆమె రీ ఎంట్రీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇద్దరి బడా హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట.

అది ఎవరంటే.. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా.. మరొకరు జూనియర్ ఎన్టీఆర్. చిరంజీవి హీరోగా ‘లూసీఫర్’ రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర ఉందని, దానికోసం జెనీలియాను సంప్రదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా ప్రకటించారు. ఇందులో కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్ర కోసం కూడా హాసినీని ఎంపిక చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి: 

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి