యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం నటిస్తున్న సినిమా మేజర్.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్.. ఏప్లస్ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోన్న ఈ మూవీ జూన్ 3 విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఆలీతో సరదగా షోలో పాల్గోన్న అడివి శేష్.. వ్యక్తిగత విషయాలతోపాటు.. కెరీర్‌కు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చాడు. చందమామ సినిమాలో తనకు క్యారెక్టర్ సెట్ కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు..
అడివిశేష్ మాట్లాడుతూ.. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని.. అమెరికాలో ఉన్నప్పుడు తన స్నేహితులు తనను సన్నీ లియోన్ అంటూ ఆటపట్టించేవారని తెలిపాడు.. అలాగే. అమెరికాలో భారతీయులకు కేవలం టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి ఇలాంటి పాత్రలే ఇస్తారని.. ఇండియన్ వ్యక్తి అక్కడ హీరో కాలేడని.. ఇప్పటికీ అక్కడ భారతీయులు కమెడియన్ పాత్రలలోనే కనిపించేవారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. చందమామ సినిమాలో తనను ముందుగా నవదీప్ పాత్ర కోసం తీసుకున్నారని.. కానీ క్యారెక్టర్ సెట్ కాకపోవడంతో రెండు రోజుల తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. బాహుబలిలో తాను పోషించిన పాత్రకు తల్లి ఎవరో డైరెక్టర్ రాజమౌళికీ కూడా తెలియదంటూ చెప్పుకొచ్చాడు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం
Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..