Cinema Theatres: తెలంగాణలో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్ల ఓపెన్.. 100 శాతం ఆక్యుపెన్సితో ప్రారంభం

|

Jul 17, 2021 | 8:43 PM

తెలంగాణలో సినియా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతినిచ్చింది.

Cinema Theatres: తెలంగాణలో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్ల ఓపెన్.. 100 శాతం ఆక్యుపెన్సితో ప్రారంభం
theatres
Follow us on

Telangana cinema theatres start: తెలంగాణలో సినియా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతినిచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23 నుంచి సినిమాల ప్రదర్శన చెయ్యాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణా అంతటా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి.రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు

టాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు, కరోనా మహమ్మారి, మరో పక్క ఓటీటీ ఎగ్జిబిటర్స్‌ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. దీంతోపాటు నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతుండటంతో థియేటర్‌ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఓటీటీలపై ఆంక్షలు విధిస్తే తప్ప థియేటర్స్‌ తెరవలేమని డిస్ట్రిబ్యూటర్లు మంకుపట్టుపట్టారు. దీంతో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హామీతో దిగివచ్చారు. థియేటర్లను తెరిచేందుకు అంగీకరించారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన.. వెండితెర తిరిగి వెలగబోతోంది. ఆదివారం నాటి నుంచి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. ఈ దిశగా.. రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్.. నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ వల్ల థియేటర్ నిర్వాహకులైన తాము తీవ్రంగా నష్టపోయామనీ.. తమను ఆదుకోవాలంటూ ఎగ్జిబిటర్ల అసోసియేషన్- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసింది. తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఈ మేరకు థియేటర్లను ఆదుకునేలా ఓ స్పష్టమైన హామీ లభించింది. దీంతో ఈ సండే నుంచి సినిమా హాళ్లలో సందడి షురూ కానుంది.

తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఎగ్జిబిటర్ల అసోసియేషన్లు కలిసి తీసుకున్న ఈ సంయుక్త నిర్ణయంతో ప్రేక్షకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దానికితోడు ఈ నెల 23న కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో వంద శాతం సీట్ల సామర్ధ్యంతో మల్టిప్లెక్స్- సింగిల్ స్క్రీన్ థియేటర్ల హడావిడి తిరిగి మొదలు కానుంది.

2017 నాటి జీవో నెంబర్ 75, పార్కింగ్ ఫీజు వసూలు, విద్యుత్ ఛార్జీల మినహాయింపు, మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు, జీఎస్టీ తగ్గింపు వంటి నిర్ణయాలతో తమను ఆదుకోవాలన్నది ఎగ్జిబిటర్ల విన్నపం. వీటన్నిటిపై తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడం వల్లే రేపటి నుంచి థియేటర్ల ఓపెనింగ్ పై ఒక నిర్ణయానికి రాగలిగామని అంటున్నారు నిర్వాహకులు.

Read Also….  Fire Accident: రన్నింగ్‌లో ఉన్న లారీకి ఒక్కసారిగా అంటుకున్న మంటలు.. ఆ తరువాత చూస్తుండగానే..