Tapsee health tip: ఎప్పుడూ గొడవలేనా.. అప్పుడప్పుడూ కాస్త క్యాజువల్ టాక్ కూడా ఉండాలి కదా. బాలీవుడ్ బ్యూటీ తాప్సీ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్, కాంట్రవర్షియల్ కామెంట్స్‌తో వార్తల్లో ఉండే ఈ బ్యూటీ.. ఈ సారి మాత్రం ఓ హెల్త్ టిప్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
‘రష్మి రాకెట్’ సినిమా కోసం హై రేంజ్ వర్కౌట్లు చేసిన తాప్సీ.. ఆ ప్రెజర్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఓ సెల్ఫ్ మేడ్ ప్రొటీన్ డ్రింక్‌ని ట్రై చేశారు. దీన్ని తాను వాడటమే కాదు.. మీరు కూడా ఈ డ్రింక్‌ను ట్రై చేయండి. పిల్స్‌ని వాడకండి అంటూ ఫ్యాన్స్‌కి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు.
యాపిల్ సీడర్ వెనిగర్‌తో మేథీ, పసుపు, అల్లం కలిపి తాగితే అలసి పోయిన మీరు వెంటనే రీచార్జ్ కావొచ్చని తాప్సీ అన్నారు. కాగా రష్మి రాకెట్ సినిమాలో విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన రన్నర్‌గా తాప్సీ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం రష్మి చేసిన వర్క్ అవుట్స్, ఆమె అచ్చీవ్ చేసిన ఫిట్‌నెస్‌ని చూసి ఫిలిం స్టార్సే షాక్ అవుతున్నారు.