AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవును మా తమ్ముడిపై మాకు ప్రేమ లేదు: సుశాంత్ సోదరి కీలక పోస్ట్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు విషయంలో నటి రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుశాంత్‌ డబ్బులను రియా వాడుకునేదని

అవును మా తమ్ముడిపై మాకు ప్రేమ లేదు: సుశాంత్ సోదరి కీలక పోస్ట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 28, 2020 | 11:12 AM

Share

Sushant Death Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు విషయంలో నటి రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుశాంత్‌ డబ్బులను రియా వాడుకునేదని, అతడికి డ్రగ్స్ అలవాటు చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులు సైతం.. అతడు తమకు దూరం అయ్యేందుకు రియానే కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రియా.. సుశాంత్ కుటుంబంపై విమర్శలు చేశారు. సుశాంత్‌ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని తెలిసినా, అతడి కుటుంబం పట్టించుకోకుండా వదిలేసిందని అన్నారు. సుశాంత్‌పై అతడి కుటుంబానికి ప్రేమ లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఆరోపణలపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కిర్తి సోషల్ మీడియాలో వెల్లడించారు.

”రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా తమ్ముడిపై మాకు ప్రేమ లేదని చెప్పింది. అవును నిజమే. నా తమ్ముడిపై ప్రేమ లేకుండానే అతడికి బాలేదని, చండీఘడ్‌లోని తన సోదరి ఇంటికి వస్తున్నాడని తెలిసి నేను జనవరిలో అమెరికా నుంచి భారత్‌కి వెళ్లాను. ఇక్కడ నా పిల్లలను వదిలేసి, నా బిజినెస్‌ని కూడా వదిలేసి అక్కడకు వెళ్లాను” అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా అప్పుడు బుక్ చేసుకున్న ఫ్లైయిట్‌ టికెట్‌ని శ్వేతా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కాగా సుశాంత్‌ కేసులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. రియా డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్‌ బయటకు వచ్చిన నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెపై కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కూడా వేగంగా జరుగుతోంది.

Read More:

గణేషుడి నిమజ్జనంలో కాల్పుల కలకలం

Breaking: రొట్టెల పండుగ రద్దు.. ఉత్తర్వులు జారీ

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు