‘సూరారై పొట్రూ’కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైన సూర్య సినిమా..

|

Dec 21, 2020 | 5:39 AM

సూర్య హీరోగా నటించిన 'సూరారై పొట్రూ' సినిమా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. వచ్చే ఏడాది

సూరారై పొట్రూకు అరుదైన గౌరవం..  ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైన సూర్య సినిమా..
Follow us on

సూర్య హీరోగా నటించిన ‘సూరారై పొట్రూ’ సినిమా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. 2 డీ ఎంటర్టైన్మెంట్ నిర్మాత రాజ్‌సేకర్ పాండియన్ ఈ తీపి వార్తను అభిమానులతో పంచుకునేందుకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆకాశమే హద్దురా. ప్రస్తుతం ఈ సినిమ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శితమవుతోంది.

ఈ సినిమాకు దర్శకుడు సుధ కొంగర ప్రసాద్ కాగా హీరోయిన్‌గా అపర్ణ బాలమురళి నటించింది. ఈ సినిమా ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. గోల్డెన్ గ్లోబ్స్‌లో ఈ ఏడాది విదేశీ భాషా చిత్ర విభాగంలో ప్రదర్శించనున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా థియేట్రికల్ విడుదలను దాటవేసిన ‘సూరారై పొట్రు’ సినిమాకు ఇది భారీ గుర్తింపుగా భావించవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ప్రసారం చేసిన మొట్టమొదటి పెద్ద తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. ఓటీటీలో విడుదల చేయాలన్న తన నిర్ణయాన్ని సూర్య ప్రకటించిన తరువాత అనేక తమిళ చిత్రాలు ఓటీటీలో విడుదల చేసేందుకు అనుసరించాయి.