‘విక్రమ్ వేద’ రీమేక్.. ఈసారి కూడా రూమరే.!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’. 2017లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పుష్కర్, గాయత్రి కలిసి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా తెలుగు‌లో రీమేక్ కానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ , నారా రోహిత్ హీరోలుగా నటించనున్నారని వి వి […]

విక్రమ్ వేద రీమేక్.. ఈసారి కూడా రూమరే.!

Updated on: May 07, 2019 | 1:30 PM

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’. 2017లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పుష్కర్, గాయత్రి కలిసి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా తెలుగు‌లో రీమేక్ కానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ , నారా రోహిత్ హీరోలుగా నటించనున్నారని వి వి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీంతో సురేష్ ప్రొడక్షన్స్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. విక్రమ్ వేద తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఆయన ప్రస్తుతం వెంకీ మామ సినిమా షూటింగ్ బిజీగా ఉన్నారని తెలిపింది. త్వరలోనే వెంకీ తదుపరి చిత్రాలను ప్రకటిస్తామని సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.