Supreme Court: హాస్యనటుడు మునావర్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్.. మధ్యప్రదేశ్ సర్కార్‌కు నోటీసులు

|

Feb 05, 2021 | 1:34 PM

Munawar Faruqui: దేవతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సుప్రీంకోర్టు హాస్యనటుడు మునావర్ ఫారూకీకి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అంతేకాకుండా మధ్యప్రదేశ్...

Supreme Court: హాస్యనటుడు మునావర్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్.. మధ్యప్రదేశ్ సర్కార్‌కు నోటీసులు
Follow us on

Munawar Faruqui: దేవతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సుప్రీంకోర్టు హాస్యనటుడు మునావర్ ఫారూకీకి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అంతేకాకుండా మధ్యప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్‌ను కూడా సుప్రీం కోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హిందూ దేవతలు, కేంద్ర హోంమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఫిర్యాదు మేరకు.. మధ్యప్రదేశ్ పోలీసులు మునావర్ ఫారూకీతోపాటు నలుగురిపై కేసు నమోదు చేసి జనవరి 1న అరెస్టు చేశారు.

ఈ కేసులో సేషన్స్ కోర్టు, అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో మునావర్ సుప్రీంను ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన వారెంటును నిలిపివేసింది. గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టాన్ని పాటించలేదని దీనిపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీం మధ్యప్రదేశ్ సర్కారుకు నోటీసులు జారీ చేసింది.

Also Read:

RBI Monetary Policy: కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఎప్పటిలాగానే వడ్డీ రేట్లు..

Chakka Jam: ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా చక్కా జామ్.. రైతు సంఘం నేత తికాయత్ కీలక వ్యాఖ్యలు