బాలీవుడ్ కామెడి కింగ్ కపిల్ శర్మ ఓ కేసులో ఇరుక్కుపోయాడు. గురువారం ముంబై క్రైం ఇంటెలిజెన్స్ సంస్థ ఆయనకు సమన్లు ఇచ్చింది. ఇటీవల ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ రిజస్టర్డ్ కార్ల కేసులో కపిల్ స్టెట్మెంట్ కోసం ఏపీఐ సచిన్ వాజ్ ఆయనను పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం మధ్యాహ్నం కపిల్ ముంబై క్రైం బ్రాంచ్ ఆఫీసులో హజరయ్యారు. ఆ తర్వాత కపిల్ శర్మ మీడియాతో మాట్లాడారు. “నా వానిటీ వ్యాన్ కారు తయారీ కోసం ప్రముఖ కార్ల డిజైనర్ దిలీప్ చాబ్రియాకు డబ్బులు ఇచ్చాను. కానీ అతను డబ్బులు తీసుకొని నా కారు డిజైన్ చేయలేదు. అదే విషయమై ఇటీవల నేను ఎంసీయు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసు విచారణలో భాగంగా నా వాంగ్ములం తీసుకునేందుకు పోలీసులు పిలిచారు” అని చెప్పారు.
Also Read: