Bahubali: రాజమౌళి ఆఫర్‌ను వదులుకున్న రియల్‌ హీరో.. అసలు కారణం ఏంటో తెలుసా.?

|

Jun 26, 2022 | 9:41 PM

Bahubali: బాహుబలి (Bahubali).. ఈ సినిమా గురించి తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్‌, రానాల అద్భుత నటన బాహుబలి చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చింది...

Bahubali: రాజమౌళి ఆఫర్‌ను వదులుకున్న రియల్‌ హీరో.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Follow us on

Bahubali: బాహుబలి (Bahubali).. ఈ సినిమా గురించి తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్‌, రానాల అద్భుత నటన బాహుబలి చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చింది. అప్పటి వరకు ఉన్న అన్ని ఇండస్ట్రీల రికార్డులను తిరగరాసిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు సరికొత్త సంచనాలను సృష్టించింది. ఇలాంటి చిత్రంలో ఆఫర్‌ వస్తే కాదని వారు ఎవరైనా ఉంటారా.? చెప్పండి. అది కూడా బాహుబలి మొదటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత వచ్చిన బాహుబలి2 చిత్రానికి. అయితే ఓ నటుడు మాత్రం ఆ అవకాశాన్ని వదులుకున్నారు.

ఇంతకీ ఆ నటుడు మరెవరో కాదు.. విలన్‌గా కెరీర్‌ మెదలు పెట్టి కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన రియల్‌ హీరో సోనూసూద్‌. అవును బాహుబలి2 నటించే అవకాశం వచ్చినా సోనూసూద్‌ వదులుకోవాల్సి వచ్చిందంటా. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్‌ ఈ విషయమై స్వయంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాహుబలి పార్ట్‌ 2 కోసం దర్శకుడు రాజమౌళి పలు వర్కింగ్‌ డేట్స్‌ అడిగారు.

ఇవి కూడా చదవండి

అయితే రాజమౌళి అడిగినట్లు డేట్స్‌ కుదరకపోవడంతో సినిమాను తిరస్కరించాల్సి వచ్చింది’ అని అసలు రీజన్‌ చెప్పుకొచ్చాడు సోనూసూద్‌. ఇదిలా ఉంటే బాహులి2లో ఒకవేళ సోనూసూద్ నటించి ఉంటే ఏ పాత్రలో నటించే వాడనే చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో నటించిన సోనూసూద్‌ మరో తెలుగు చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..