sonu sood music video : ఆర్మీ ఆఫీసర్‌‌‌గా మారిన సోనుసూద్.. ఆకట్టుకుంటున్న మ్యూజిక్ వీడియో

సోనూసూద్ లాక్ డౌన్ లో ఎక్కడ చూసిన ఈ పేరు మారుమ్రోగింది. వలసకార్మికుల పాలిట దైవంగా మారడు ఈ రియల్ హీరో. దేశం మొత్తం సోనూసూద్ పై ప్రసంశలు కురిపించింది.

sonu sood music video : ఆర్మీ ఆఫీసర్‌‌‌గా మారిన సోనుసూద్.. ఆకట్టుకుంటున్న మ్యూజిక్ వీడియో

Updated on: Jan 15, 2021 | 6:35 PM

Sonu Sood : సోనూసూద్ లాక్ డౌన్ లో ఎక్కడ చూసిన ఈ పేరు మారుమ్రోగింది. వలసకార్మికుల పాలిట దైవంగా మారడు ఈ రియల్ హీరో. దేశం మొత్తం సోనూసూద్ పై ప్రసంశలు కురిపించింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కూడా సోనూసూద్ ను వరించాయి. అంతే కాకుండా కష్టం చెప్పుకున్నవారికి కాదనకుండా.. లేదనకుండా.. సాయం అందిస్తున్నారు సోనూ. ఇక వరుస సినిమాలతో ఇటు తెలుగులోను అటు హిందీలోనూ బిజీగా ఉన్నారు సోనూసూద్.

తాజాగా తొలిసారి ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించారు. సింగ‌ర్ సునంద శ‌ర్మతో క‌లిసి పాగ‌ల్ న‌హీ హోనా మ్యూజిక్ వీడియోలో న‌టించాడు సోనూసూద్. శుక్రవారం ఈ వీడియోను విడుదల చేశారు. అద్భుతమైన లిరిక్స్ తో సాగిన ఈ రొమాంటిక్ వీడియోలో సోనూసూద్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. అలాగే అతడిని ప్రేమించే యువతిగా సింగర్ సునంద శ‌ర్మ కనిపించింది. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us