మొన్న వలస కార్మికులకు.. ఇవాళ నిసర్గ బాధితులకు.. హ్యాట్సాఫ్‌ సోనూ..!

ఇప్పటికే లాక్‌డౌన్ వలన ఇబ్బందుల పడుతున్న ఎంతో మంది వలస కార్మికులకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్.. మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. నిసర్గ తుఫాను ప్రభావం నుంచి వేలాది మందిని ఆయన కాపాడారు. దాదాపు 28వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సోనూ.. వారికి ఆహారం కూడా పంపిణీ చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ”ప్రస్తుతం మనం చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. అందరం ఒకరికొకరం అండగా నిలబడి ధైర్యంగా పోరాడాలి. […]

మొన్న వలస కార్మికులకు.. ఇవాళ నిసర్గ బాధితులకు.. హ్యాట్సాఫ్‌ సోనూ..!

Updated on: Jun 04, 2020 | 8:33 PM

ఇప్పటికే లాక్‌డౌన్ వలన ఇబ్బందుల పడుతున్న ఎంతో మంది వలస కార్మికులకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్.. మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. నిసర్గ తుఫాను ప్రభావం నుంచి వేలాది మందిని ఆయన కాపాడారు. దాదాపు 28వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సోనూ.. వారికి ఆహారం కూడా పంపిణీ చేశారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. ”ప్రస్తుతం మనం చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. అందరం ఒకరికొకరం అండగా నిలబడి ధైర్యంగా పోరాడాలి. నిసర్గ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నా బృందంతో తీర ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలను తరలించాం. దాదాపు 28వేల మందికి ఆహారం అందించాం. వారంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం” అని అన్నారు. అదే విధంగా ముంబైలో చిక్కుకుపోయిన 200 మంది అస్సామీ వలస కార్మికులను షెల్డర్ హోమ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఆయన సహాయంపై మరోసారి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మీరు రియల్ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: వివాదంలో యూవీ.. కేసు నమోదు..!

Loading...
Unable to load recommendations.
Follow Us