వివాదంలో యూవీ.. కేసు నమోదు..!

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. యజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్‌ కులాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనను వివాదంలోకి నెట్టాయి. రెండు రోజుల క్రితం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో లైవ్‌లో మాట్లాడిన యువరాజ్‌ చాహల్‌పై బాంగి(కులాన్ని ఉద్దేశిస్తూ) అనే పదాన్ని వాడారు. అందుకు రోహిత్ సైతం నవ్వారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. యూవీపై కొందరు విమర్శలు కురిపిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో న్యాయవాది, దళిత […]

వివాదంలో యూవీ.. కేసు నమోదు..!
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 7:25 PM

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. యజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్‌ కులాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనను వివాదంలోకి నెట్టాయి. రెండు రోజుల క్రితం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో లైవ్‌లో మాట్లాడిన యువరాజ్‌ చాహల్‌పై బాంగి(కులాన్ని ఉద్దేశిస్తూ) అనే పదాన్ని వాడారు. అందుకు రోహిత్ సైతం నవ్వారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. యూవీపై కొందరు విమర్శలు కురిపిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో న్యాయవాది, దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సాన్ హన్సీలో యువరాజ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువరాజ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆ తరువాత కల్సన్ మాట్లాడుతూ.. యువరాజ్ మాట్లాడే సమయంలో రోహిత్ కనీసం అసంతృప్తిని వ్యక్తం చేయలేదని అన్నారు. మరోవైపు ఈ కేసుపై హన్సి ఎస్‌పీ మాట్లాడుతూ.. ఈ కేసు విచారణను డీఎస్‌పీకి అప్పగించామని అన్నారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని.. యూవీ తప్పు చేశాడని తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read This Story Also: ‘కార్తికేయ 2’ నుంచి తప్పుకున్న అనుపమ.. రీజన్ అదేనా!