Sonu Sood: మరోసారి వార్తల్లో నిలిచిన కలియుగ కర్ణుడు సోనూసూద్.. ఈసారి ఏం చేశారో తెలుసా..

|

Feb 13, 2021 | 10:25 AM

Sonu Sood: కలియుగ కర్ణుడు సోనూసూద్ మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాల్లో విలన్‌గా చేసినా నిజ జీవితంలో మాత్రం హీరోగా నిలుస్తున్నాడు. కరోనా వల్ల ప్రభుత్వాలు

Sonu Sood: మరోసారి వార్తల్లో నిలిచిన కలియుగ కర్ణుడు సోనూసూద్.. ఈసారి ఏం చేశారో తెలుసా..
Follow us on

Sonu Sood: కలియుగ కర్ణుడు సోనూసూద్ మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాల్లో విలన్‌గా చేసినా నిజ జీవితంలో మాత్రం హీరోగా నిలుస్తున్నాడు. కరోనా వల్ల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లడానికి ఎంత కష్టపడ్డారో అందరికి తెలుసు. ఆ సమయంలోనే సోనూ వలస కూలీలకు సాయం చేస్తూ అందరి ప్రశంసలు పొందారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేశాక షూటింగ్‌లో పాల్గొంటున్న సోనూసూద్‌ ఇప్పటికీ తన సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు.

తాజాగా తన స్వస్థలం పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఈ-రిక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్‌ సచార్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలు తెలియజేవారు. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, దీంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి తోచినంత సాయం చేయండి. నేను నా తల్లిదండ్రుల నుంచి ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నానని ప్రకటించారు. నేను దేవుణ్ని కాదని అందరిలాగే అవసరమైన వారికి సాయం చేస్తూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నానని గుర్తుచేశారు.

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..