
ఫిట్‌నెస్ కోసం విభిన్నమైన ఎక్సర్‌సైజులు, రకరకాల జ్యూస్‌లు, జిమ్‌లో కసరత్తులు, బోలెడ్ డబ్బు ఖర్చు చేసి ఫిట్‌నెస్ ట్రైనర్ల వీటిలో ఎన్ని చేసినా మన ఆహార నియమాలు బాగుంటేనే ఫిట్‌గా ఉంటాం. తినే ఫుడ్, తాగే జ్యూస్‌ల నుంచి అన్నింటిపైనా శ్రద్ద పెడితేనే ఫిట్‌నెస్ దరిచేరుతుందని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్. 47 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఫిట్ నెస్ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరిలోనూ స్ఫూర్తినింపుతుంది. తన స్పెషల్ డిటాక్స్ జ్యూస్ రెసిపీని న్యూ ఇయర్‌కు ముందు అభిమానులతో షేర్ చేసింది.
Soha Ali Khan
సాధారణంగా పండుగలు, పార్టీల సమయంలో మనం రకరకాల జంక్ ఫుడ్ తింటూ ఉంటాం. ఆ తర్వాత వచ్చే నీరసాన్ని పోగొట్టి, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి ఈ గ్రీన్ జ్యూస్ చక్కగా పనిచేస్తుందని సోహా అలీ ఖాన్ చెబుతోంది. కేవలం బరువు తగ్గడానికే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడడానికి ఈ డ్రింక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్యారెట్ (సగం), దోసకాయ (సగం), సెలెరీ స్టిక్స్ (2), కొబ్బరి నీళ్లు (పావు కప్పు), రాత్రంతా నానబెట్టిన చియా సీడ్స్ (ఒకటిన్నర చెంచా), డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, కొంచెం అల్లం తురుము, కొత్తిమీర, మొలకెత్తిన పెసలు (ఒక పిడికెడు), హెంప్ సీడ్స్ కొన్ని ఆకుకూరలు (పాలకూర లేదా లెట్యూస్).
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. అవసరమైతే మరిన్ని కొబ్బరి నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వడకట్టి తాజా జ్యూస్‌లా తీసుకోవాలి. ఇందులో వాడే అల్లం రోగనిరోధక శక్తిని పెంచితే, కొబ్బరి నీళ్లు బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
ఈ హెల్తీ డ్రింక్ గురించి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ.. “ఇది కేవలం డిటాక్స్ మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన హైడ్రేషన్, ఫైబర్ పోషకాలను అందిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత, లంచ్ కంటే ముందు దీనిని తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఎప్పుడూ యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించే ఈ అందాల తార చెప్పిన ఈ చిట్కా ఫాలో అయితే, 2026లో మనం కూడా ఫిట్‌గా కనిపించడం ఖాయం. మీరు కూడా ఈ హెల్తీ డ్రింక్‌ని మీ డైట్‌లో చేర్చుకుని కొత్త ఏడాదిని ఆరోగ్యంగా స్వాగతించండి!