
మనకూ లంకకూ మధ్య ఆ రామసేతు బ్రిడ్జిని కట్టిందెవరు.. ఒకవేళ మీరంటున్నట్టు రాముడే ఐతే ఆ రాముడు ఏ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు? 40 ఏళ్ల కిందట తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అడిగిన ఈ ప్రశ్న.. అప్పట్లో ప్రపంచ హైందవ సమాజం మొత్తాన్ని కదిలించింది. అడిగింది కరడుగట్టిన నాస్తికవాది గనుక ఆయన మానానికి ఆయన్ను వదిలేసి సైలెంటైపోయారు. పైగా, అప్పట్లో సోషల్ మీడియా లేదు.. ఉన్న మీడియా కూడా అంతంతమాత్రమే. ఇప్పుడైతే సీన్ మారింది. సోషల్ మీడియా విశృంఖలంగా పెరిగి గిగా సైజుకు చేరింది. సామాజిక సమస్యలపై లోతైన చర్చలు చేస్తోంది. అదే గ్యాప్‌లో సూటిగా ఓ ప్రశ్ననూ పుట్టిస్తోంది.. ఆ ప్రశ్నను సహించలేని గుణాన్ని కూడా పెంచిపోషిస్తోంది. ఎందుకంటే, వీటిలో కొన్ని ఆలోచింపజేసే ప్రశ్నలు. కొన్ని ఆకతాయి ప్రశ్నలు. కొన్ని నిలబడేవి, కొన్ని కలబడేవి. ఇలా కయ్యానికి కాలు దువ్వే ప్రశ్నలే ఇప్పుడు చిన్నసైజు సంక్షోభాలుగా మారుతున్నాయా? ఈ ప్రశ్నలతో ఒనగూడే ప్రయోజనాలు ఎంతెంతమాత్రం? >>ఎవరు చెప్పారు.. మనకు స్వాతంత్రం గాంధీ తీసుకొచ్చారని..? ఒక శ్రీకాంత్ అయ్యంగార్ క్వశ్చనింగ్. >>అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారా అని ఒక అసదుద్దీన్ ఒవైసీ లాజికల్ క్వశ్చన్. >>అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ కంటే ఆదిగురువు ఎవరుంటారు...