Rahul Sipligunj: గోషామహల్‌ నుంచి ఎన్నికల బరిలోకి రాహుల్ సిప్లిగంజ్‌.. సింగర్ ఆన్సర్‌ ఏంటంటే

|

Aug 26, 2023 | 3:16 PM

హైదరాబాద్‌లోని గోషా మహల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాహుల్‌ బరిలోకి దిగనున్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీటిలో ఒక్క గోషామహల్‌ సీటును మాత్రం కేసీఆర్ ప్రకటించలేదు. దీంతో రాహుల్ ఈ స్థానంలో బీఆర్ఎస్‌ తరఫున పోటీ చేస్తున్నారనే వార్తకు బలం చేకూర్చినట్లైంది. ఈ వార్త కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి రాహుల్ సిప్లిగంజ్‌...

Rahul Sipligunj: గోషామహల్‌ నుంచి ఎన్నికల బరిలోకి రాహుల్ సిప్లిగంజ్‌.. సింగర్ ఆన్సర్‌ ఏంటంటే
Rahul Sipligunj
Follow us on

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రోజులు ఉన్నాయి. ఎప్పుడు ఏ వార్త ఎఎందుకు వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇలా సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్తపై చర్చ జరుగుతూనే ఉంటుంది. అసలు ఎవరు మొదలు పెట్టారో తెలియదు. తాజాగా ఇలాంటి ఓ వార్తనే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలంగాణకు చెందిన ప్రముఖ ర్యాంప్‌ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నాడనదేది సదరు వార్త సారంశం.

హైదరాబాద్‌లోని గోషా మహల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాహుల్‌ బరిలోకి దిగనున్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీటిలో ఒక్క గోషామహల్‌ సీటును మాత్రం కేసీఆర్ ప్రకటించలేదు. దీంతో రాహుల్ ఈ స్థానంలో బీఆర్ఎస్‌ తరఫున పోటీ చేస్తున్నారనే వార్తకు బలం చేకూర్చినట్లైంది. ఈ వార్త కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి రాహుల్ సిప్లిగంజ్‌ వరకు చేరింది. దీంతో ఈ వార్తపై క్లారిటీ ఇచ్చారు ఆయన. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని జరుగుతోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాహుల్‌ తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై రాహుల్ సిప్లిగంజ్‌ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. ఈ విషయమై రాహుల్ పోస్ట్ చేస్తూ.. ‘నేను రాజకీయాల్లో రావడం లేదు. రానున్న ఎన్నికల్లో గోషామహల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నానంటూ గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒక కళాకారుడిగా అందరికీ వినోదాన్ని అందించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఇక తన ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ.. ‘సంగీత రంగంలోనే కొనసాగుతూ.. పరిశ్రమకు మరింత సేవ చేయాలనుకుంటున్నా. నన్ను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదు. కాబట్టి దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి’’ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే రాహుల్‌ సిప్లిగంజ్‌ నాటు నాటు సాంగ్‌తో నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పలు సినిమాల్లో కూడా నటించాడు రాహుల్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..