మజిలీ దర్శకుడికి బంపర్ ఆఫర్..!

|

Apr 09, 2019 | 7:22 PM

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటించిన తాజా చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకుంటోంది. సెన్సిటివ్ ఎమోషన్స్ ను శివ బాగా తెరకెక్కించాడని సినీ ప్రముఖులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆయన తొలి చిత్రం ‘నిన్ను కోరి’ కూడా మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన […]

మజిలీ దర్శకుడికి బంపర్ ఆఫర్..!
Follow us on

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటించిన తాజా చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకుంటోంది. సెన్సిటివ్ ఎమోషన్స్ ను శివ బాగా తెరకెక్కించాడని సినీ ప్రముఖులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆయన తొలి చిత్రం ‘నిన్ను కోరి’ కూడా మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా శివ నిర్వాణతో కలిసి పని చేయడానికి యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. శివ కూడా విజయ్ కోసం మంచి కథ సిద్ధం చేయబోతున్నట్లు టాక్. దీనిపై అధికారక ప్రకటన కొద్దిరోజులలో రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ప్రమోషన్స్‌తో పాటు క్రాంతి మాధవ్ చిత్రం షూటింగ్ లోనూ బిజీగా ఉన్నాడు.