Breaking: ‘మౌనరాగం’ సీరియల్‌‌ నటి శ్రావణి ఆత్మహత్య

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.  రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది.

Breaking: మౌనరాగం సీరియల్‌‌ నటి శ్రావణి ఆత్మహత్య

Edited By:

Updated on: Sep 09, 2020 | 7:02 AM

Serial Actress Sravani: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.  రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్‌లో నివసిస్తున్న శ్రావణి, అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రావణి తెలుగు సీరియల్స్ లో నటిస్తున్నారు. ‘మౌనరాగం’, ‘మనసు మమత’ లాంటి పలు సీరియల్‌లో ఆమె నటిస్తున్నారు. అయితే ‘టిక్ టాక్’లో పరిచయమైన దేవరాజు రెడ్డి అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాకినాడకు చెందిన దేవరాజు రెడ్డి కొన్ని రోజులుగా శ్రావణిని వేధిస్తున్నాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని శ్రావణి సోదరుడు డిమాండ్ వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అతడిపై ఎస్సార్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Read More:

అమీర్‌పేట్‌ సెంటర్‌లో డ్రగ్స్ .. బంటి గ్యాంగ్ దొరికింది

రియాకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

 

Follow Us