అమీర్‌పేట్‌ సెంటర్‌లో డ్రగ్స్ .. బంటి గ్యాంగ్ దొరికింది

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ కలకలం రేపింది. అమీర్‌పేట్‌లో మరో డ్రగ్స్ గ్యాంగ్ పట్టు పడింది.  ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు చేరవేస్తున్న బంటీ ముఠాను బుధవారం నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంటీ ముఠా సభ్యుల నుంచి ఎక్స్ స్టసి పిల్స్ 46 గ్రాములు, 2 గ్రాముల MDMA, 10 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. […]

అమీర్‌పేట్‌ సెంటర్‌లో డ్రగ్స్ ..  బంటి గ్యాంగ్ దొరికింది
Follow us

|

Updated on: Sep 09, 2020 | 3:40 AM

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ కలకలం రేపింది. అమీర్‌పేట్‌లో మరో డ్రగ్స్ గ్యాంగ్ పట్టు పడింది.  ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు చేరవేస్తున్న బంటీ ముఠాను బుధవారం నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బంటీ ముఠా సభ్యుల నుంచి ఎక్స్ స్టసి పిల్స్ 46 గ్రాములు, 2 గ్రాముల MDMA, 10 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. బంటీతో పాటు నగరానికి చెందిన రోహిత్, నవీన్‌రాజ్ డ్రగ్స్ కోసం గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాకు చెందిన కునాల్‌, రఫీ పరార్‌ ఇద్దరు ముఠా సభ్యులు బంటీ గ్యాంగ్‌కు డ్రగ్స్‌ సరపర చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులు వాడిన టూ వీలర్, కార్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారు నగరంలో వారు ఎవరికి ఈ డ్రగ్స్ ను పంపిణీ చేసేవారు అనే కోణంలో కూపీ లాగుతున్నారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్ వాడకం దారుల వివరాలను సేకరిస్తున్నారు. వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు వెల్లడించారు.