అవును నాకు కరోనా సోకింది: బుల్లితెర నటుడు‌‌ రవికృష్ణ

తెలుగు సీరియల్స్ రంగంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల సీరియళ్ల షూటింగ్‌లను ప్రారంభించగా..

అవును నాకు  కరోనా సోకింది: బుల్లితెర నటుడు‌‌ రవికృష్ణ

Edited By:

Updated on: Jul 04, 2020 | 10:09 AM

తెలుగు సీరియల్స్ రంగంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల సీరియళ్ల షూటింగ్‌లను ప్రారంభించగా.. అందులో పాల్గొంటున్న వారు ఒక్కొక్కరుగా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఓ ఐదారు మంది పేరు మోసిన బుల్లితెర నటులకు కరోనా సోకగా.. తాజాగా ‘ఆమె కథ’, ‘వరూధిని పరిణయం’ ఫేమ్, ‘బిగ్‌బాస్‌ 3’ కంటెస్టెంట్‌ రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.

”నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా నేను ఐసోలేషన్‌లో ఉంటున్నాను. దేవుడి దయ, మీ ఆశీస్సుల వలన ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఈ వైరస్‌ ఎక్కడి నుంచి నాకు సోకిందన్న దానిపై నేనేం బాధపడటం లేదు. అయితే నాతో కాంటాక్ట్‌ అయిన వారందరూ పరీక్షలు చేయించుకొని, ఐసోలేషన్‌లో ఉండమని మాత్రం నేను కోరుతున్నా. అలాగే వైరస్ సోకిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించకండని కోరుతున్నా. నెగిటివిటీకి దూరంగా ఉండి, త్వరగా నేను కోలుకోవాలని ఆశిస్తున్నా” అని రవికృష్ణ తెలిపారు. కాగా ఆమె కథలో రవికృష్ణ సరసన నటించే ‘నవ్య స్వామి’కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.