Yashoda OTT: ఓటీటీలోకి సమంత ‘యశోద’ వచ్చేది అప్పుడేనా..? స్ట్రీమింగ్ ఎక్కడంటే!

|

Nov 22, 2022 | 5:15 PM

థియేటర్లలో సక్సెస్‏ఫుల్‏గా రన్ అవుతున్న 'యశోద' మూవీకి సంబంధించి ఓటీటీ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Yashoda OTT: ఓటీటీలోకి సమంత యశోద వచ్చేది అప్పుడేనా..? స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yashoda
Follow us on

‘ఓ బేబీ’ తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ రోల్‌లో సమంత నటించిన సినిమా ‘యశోద’. ఈ సినిమాకు హరి, హరీష్ డైరెక్టర్లు. సరోగసి నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. థియేటర్లలో సక్సెస్‏ఫుల్‏గా రన్ అవుతున్న ‘యశోద’ మూవీకి సంబంధించి ఓటీటీ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘యశోద’ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా, మెడికల్ మాఫియా కాన్సెప్ట్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్లో సామ్ ఎంతో కష్టపడింది. అలాగే మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా నిలిచింది.