Saiee Manjrekar: కొంతమందికి అదృష్టం తలుపుతట్టి మరీ వస్తోంది. ఇలాంటి వాళ్లు అరుదుగా ఉన్నా మంచి గుర్తింపును సాధిస్తారు. అలాంటి కోవకే చెందినది బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే వరుస అవకాశాలు ఎదురుగా వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్‌గా మారుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాయి మంజ్రేకర్ ‘దబాంగ్ 3’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అడవి శేషు ‘మేజర్’ ద్వారా టాలీవుడ్‌లోనూ ఎంటర్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే వరుణ్ తేజ్ మూవీలోనూ ఫీమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ కొట్టేసిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే ఫైనల్ అయిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీలోనూ తన పేరే పరిశీలనలో ఉందన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శేషు, వరుణ్ తేజ్‌తో సినిమాలు సక్సెస్ అయి బన్నీ, పవన్ కళ్యాణ్‌తో ప్రాజెక్ట్స్ చేస్తే నిజంగానే టాలీవుడ్‌లో నెంబర్ వన్ అవుతుందని పలువురు భావిస్తున్నారు.
‘అన్‌పెయిర్ అండ్ లవ్లీ’ షూటింగ్ కబుర్లు చెబుతున్న గోవా భామ.. లాక్‌డౌన్ వల్ల క్యారెక్టరే మరిచిపోయా..