నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం `రూలర్`. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుగా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ సంబంధించి ఇటీవలే అన్ని పనులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు ప్రమోషన్లను కూడా భారీగా చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రామజోగయ్య శాస్త్రి రచించిన అడుగడుగో యాక్షన్ హీరో…అరే దేఖో యారో..అనే పాటను విడుదల చేయనున్నారు. రూలర్ మోషన్ పోస్టర్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్‌లో ఈ పాట వినిపిస్తుంది. అయితే, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లుగా సమాచారం. ఇక, జై సింహా వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో రూలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోనాల్, చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ, షాయాజీ షిండే, ధన్‌రాజ్, కారుమంచి రఘు తదితరులు కీలక పాత్రధారులు, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.