మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళీ ఈ సినిమాకు రూపొందిస్తున్నారు. దాదాపు నాలుగు వందల యాబై కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఆరంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలై ఈ మూవీ పోస్టర్స్ బిజినెస్ కూడా దూసుకుపోతుంది. అందుకు తగినట్లే ఈ మూవీ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నట్లుగా సమాచారం.
ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ హక్కులను రూ.45 కోట్లకు కోట్ చేశారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థలు ‘ఆర్ఆర్ఆర్’ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ పడ్డాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ‘ఆర్ఆర్ఆర్’ తమిళనాట థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రూ.42 కోట్లకు దక్కించుకుందని టాక్. బాహుబలి 2 థియేట్రికల్ హక్కులు రూ.37 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా, బాహుబలి2ను క్రాస్ చేసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించింది చ్రిత్రయూనిట్.