Tarun And Aarti Agarwal: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్. ‘నువ్వే కావాలి’, ‘నువ్వే నువ్వే’, ‘నువ్వులేక నేనులేను’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏవీ కూడా అంతగా ఆడలేదు. ఇదిలా ఉంటే.. అప్పట్లో దివంగత నటి ఆర్తి అగర్వాల్‌తో తరుణ్ ప్రేమాయణం నడిపారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వాస్తవాలు మాత్రం ఎవరికీ కూడా తెలియదు. అయితే తాజాగా ఈ విషయంపై హీరో తరుణ్ తల్లి రోజారమణి పూర్తి క్లారిటీ ఇచ్చారు.
”ఆర్తి అగర్వాల్‌ను నేను రెండుసార్లు మాత్రమే కలిశాను. ఆమె సైలెంట్‌గా, ఎంతో హుందాగా ఉండేది. అలాంటి అమ్మాయి సడన్‌గా ఎందుకు ప్రాణాలు తీసుకుందో తెలియదు. అసలు నిజం తెలుసుకోకుండా ఆమె సూసైడ్‌కు తరుణ్ కారణమని మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పుడు చాలా బాధపడ్డాను. ఒకవేళ తరుణ్ ఆమెను ఇష్టపడి ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పేవాడు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ కూడా కేవలం పుకార్లు మాత్రమే. వాటిల్లో ఎంత మాత్రం నిజం లేదని’ తరుణ్ తల్లి రోజారమణి వివరించారు.